మెగాఫ్యామిలీ హీరోలుగా చిరు వేసిన బాటను ఉపయోగించుకొని నడిచిన వారు ఆ ఫ్యామిలీలో అందరూ ఉన్నారు. కాగా చిరు ద్వారా, ఆయనకున్న ఇమేజ్ ద్వారా పైకెదిగిన వారు ఇప్పుడు వేరు కుంపట్లు పెట్టుకోవడానికి రెడీ అవుతున్నారనేది నిజమే. అల్లుఅరవింద్‌తో పాటు అల్లుఅర్జున్, అల్లుశిరీష్ వంటి వారు ప్రస్తుతం సొంత ఐడెంటిటీ కోసం ప్రయత్నిస్తూ, మెగా ఇమేజ్ నుండి బయటపడాలని చూస్తున్నారు. ఇప్పటికే చిరుతో వరుసగా రెండు చిత్రాలు తీసే అవకాశాన్ని ఆయన కుమారుడు చరణ్ దక్కించుకోవడం, స్వయాన తమ సొంత బేనర్‌గా 'కొణిదల' నిర్మాణ సంస్థను స్థాపించడం అల్లుకి ఇష్టంలేదు. కానీ ఈ విషయాన్ని ఆయన బయటపడకుండా ఎప్పటి నుంచో చిరు గారికి ఓన్ బేనర్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నానని తెలిపాడు. కాగా గతంలో నాగబాబు.. చిరు, పవన్, తనకు జన్మనిచ్చిన అమ్మకు కృతజ్ఞతగా భావించి 'అంజనా ప్రొడక్షన్స్' సంస్థని స్థాపించినప్పుడు ఎవ్వరూ దీనిని స్వంత సంస్థగా ఎందుకు చూడలేకపోతున్నారు? ఆయనను మెగాఫ్యామిలీ హీరోలు ఎందుకు ఎంకరేజ్ చేయలేదు? నాగబాబు బ్యానర్ స్థాపించినప్పుడు అశ్వనీదత్, అల్లుఅరవింద్, కెయస్.రామారావు వంటి వారు నాగబాబు పట్ల అసహనంగా ప్రవర్తించినది నిజం కాదా? అనేవి శేషప్రశ్నలు. ఇక ఇప్పటికే నాగబాబుకు స్వంత బేనర్, పవన్‌కు కూడా సొంతబేనర్ ఉండటంతో చరణ్ ఓన్‌గా నిర్మాత కావడం తప్పేమీకాదే..! మరి అల్లు వారి అలక ఎందుకు? బహిరంగ వేదికపైనే పవన్ ఫ్యాన్స్‌పై బన్నీ మండిపడ్డాడు. దానిని వ్యక్తిగతంగా చిరు కూడా తప్పుపట్టి, బన్నికి క్లాస్ పీకాడు. అప్పటి నుంచే అసలు విభేదాలు మొదలయ్యాయి. ఇప్పటికే పవన్.. మెగాఫ్యామిలీతో అంటీముట్టనట్లు
వ్యవహరిస్తున్నాడు. ఇక తాజాగా బన్నీ కూడా తన సోదరుడు అల్లుశిరీష్ పబ్లిక్ రిలేషన్ గ్రూప్‌ను స్థాపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనేది వాస్తవమేనని ఇండస్ట్రీ వర్గాల అంతర్గత సమాచారం. మరోపక్క ఈమధ్య వరుస విజయాలతో దూసుకుపోతున్న బన్నీ తన తండ్రిలాగా మౌనం వహించకుండా, చరణ్‌తో సైతం అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నాడని, 'మగధీర', 'ధృవ' వంటి చిత్రాల విషయంలో కూడా బన్నీ తన తండ్రితో విభేదించాడని ఇండస్ట్రీ లో కథలుకథలుగా చెప్పుకుంటున్నారు.