Advertisement
Google Ads BL

మళ్ళీ ఆ ధైర్యం ఎవరూ చేయలేదంటున్న నాగ్..!


నాగార్జున - రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఓం నమో వెంకటేశాయ' చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్దమవుతుంది. ఒక వైపు నాగార్జున, నాగచైతన్య నిశ్చితార్థంలో బిజిగా ఉంటూనే మరోవైపు 'ఓం నమో వెంకటేశాయ'  చిత్రానికి సంబందించిన పబ్లిసిటీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అందులో భాగంగా ఈరోజు జరిగిన మీడియా సమవేశంలో నాగార్జున తన మనసులోని మాటలు బయటపెట్టారు. అసలు 'ఓం నమో వెంకటేశాయ' ఈ సంక్రాంతికే విడుదల చేద్దామనుకుంటే ఆ చిత్రానికి సంబందించిన సీజ్ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో అది కాస్త ఫిబ్రవరికి విడుదల తేదీ మారినట్లు చెప్పారు. ఇకపోతే వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడిగా హాథిరామ్ బాబాగా ఈ చిత్రంలో కనిపిస్తానని చెప్పారు. ఇక అనుష్క కూడా కృష్ణమ్మా గా, ఒక భక్తురాలిగా మెప్పించిందని చెప్పారు. 

Advertisement
CJ Advs

ఇక 'అన్నమయ్య, శ్రీరామదాసు' చిత్రాలు చెయ్యడం మూలంగానే మీరు ఈ చిత్రాన్ని అంగీకరించారా.... అని మీడియా వారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా నాగ్... రాఘవేంద్ర రావు గారు ఈ కథతో నన్ను కలిసినప్పుడు అసలు వెంకటేశ్వర స్వామి మీద ఇంకా ఏం సినిమా తీస్తామని ఆయన్ని అడిగానని... దానికి ఆయన 'ఓం నమో వెంకటేశాయ' కథ చెప్పారని.... ఆయన చెప్పిన కథ నచ్చి ఓకె చేశానని చెప్పారు. ఇక 'అన్నమయ్య' కథను నా దగ్గరకు తెచ్చి రాఘవేంద్ర రావు గారు చాలా ధైర్యం చేశారని..... మళ్ళీ అలాంటి కథలతో నన్నెవరూ కలవలేదని చెప్పారు. ఇక అన్నమయ్య తర్వాత మా కాంబినేషన్లో 'శ్రీరామదాసు' చిత్రం ఎంత పెద్ద హిట్టో అందరికి తెలుసని చెప్పరు. ఇక ఇప్పుడు 'ఓం నమో వెంకటేశాయ' కూడా పెద్ద హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇక నాగ  చైతన్య గురించి మాట్లాడుతూ 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రం డిస్పాయింట్ చేసిందని మోదీ గారి డెమోనేటిజషన్ వల్ల సినిమాకి పాసిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ రాలేదని.... ఇక ఆ 'ప్రేమమ్' హిట్ తో మళ్ళీ హ్యాపీ ఫిల్ అయ్యామని చెప్పాడు. ఇంకా చిన్న కొడుకు అఖిల్  గురించి మాట్లాడుతూ... అఖిల్ కష్టపడి పైకి వచ్చే మనస్తత్వం కలవాడని.. అందుకే కథల ఎంపికలో కొంచెం ఆలస్యమయిన కారణంగానే రేండో సినిమా మొదలవ్వడానికి టైం పట్టిందని ఇక డైరెక్టర్ విక్రమ్, అఖిల్ కి మంచి సక్సెస్ ఇస్తాడని... ఇప్పటికే ఫస్ట్ ఆఫ్ స్టోరీ ని లాక్ చేసినట్లు చెప్పాడు. మొదటి సినిమా పేద్ద హిట్ అయితే ఎక్కువ హైప్ ఉండేదని... అది హిట్ కాలేదు కాబట్టే అఖిల్ రెండో సిమిమా మీద పెద్దగా హైప్ క్రియేట్ కాలేదని చెప్పారు. ఇక విక్రమ్ మీద తనకి పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. 

ఇంకా ఆయన చేసిన టీవీ షో 'మీలో ఎవరూ కోటీశ్వరుడు' గురించి మాట్లాడుతూ... నేను జనానికి బోర్ కొట్టే ముందే ఈ షో చెయ్యడం మానేద్దామనుకుని... మూడవ భాగాన్ని ఆపేద్దామని మా టీవీ వారిని కోరానని... అందుకే ఆ షో చెయ్యడం లేదని చెప్పారు. మరిన్ని టీవీ షోస్ చెయ్యడానికి తనకి టైం లేదని చెప్పారు. ఇక తన నెక్స్ట్ ప్రాజెక్ట్ 'రాజుగారి గది 2' షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుందని... ఒక హార్రర్ చిత్రంలో నటించాలి అని బాగా కోరికగా ఉండేదని ఆ కోరిక 'రాజుగారి గది 2' తో తీరిపోతుంది చెప్పారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs