దర్శకరత్న, మాజీ కేంద్రమంత్రి అయిన దాసరి నారాయణ రావు తీవ్ర అనారోగ్యం దృష్ట్యా మూడు రోజుల క్రితం హైదరాబాద్ లోకి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. ఆయన గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నట్లు చెబుతున్నారు. ఆయనకు ఆ మధ్య కాలంలో బైపాస్ సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఆరోగ్యం దృష్ట్యా దాసరి ఇప్పుడు సినిమాల్లోగాని, రాజకీయాల్లో గాని పెద్దగా యాక్టివ్ గా ఉండడం లేదు. కానీ ఆ మధ్యన కాపు ఉద్యమానికి మద్దతు ఇస్తానంటూ ముద్రగడకు దాసరి మద్దతు తెలిపి కొంచెం హడావిడి చేసిన సంగతి తెలిసిందే. ఇక కొన్నిముఖ్యమైన సినిమా వేడుకలకి మాత్రమే హాజరవుతున్న దాసరికి సడన్ గా శ్వాస సంబంధిత సమస్యతో ఆసుపత్రి ఫాలవడం కొంచెం ఆందోళన కలిగించే విషయమే అంటున్నారు. ఇక ఆయనకి మెరుగైన వైద్యం అందించడం కోసం ఐసియు కి తరలించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆయన ఆరోగ్యం ప్రస్తుతానికి నిలకడగా ఉన్నట్లు డాక్టర్స్ చెబుతున్నారు.