అల్లు అర్జున్ - హరీష్ శంకర్ కాంబినేషన్లో 'డీజే'(దువ్వాడ జగన్నాథం) చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి ఎటువంటి న్యూస్ మీడియాకి రాలేదు. ఇక షూటింగ్ స్పాట్ లో జరిగే సన్నివేశాల దగ్గర నుండి అన్ని విషయాలను ఎంతో గోప్యంగా ఉంచుతారు సినిమా యూనిట్ వాళ్ళు. ఇకపోతే డీజే కి సంబందించిన ఒక హాట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. ఇక ఈ న్యూస్ పై అల్లు అర్జున్ కోపంగా ఉన్నట్లు కూడా వార్తలొస్తున్నాయి.
ఈ చిత్రానికి సంబందించిన ఒక సన్నివేశంలో కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో కనబడడంతో అర్జున్ కి పట్టరాని కోపం వచ్చేసిందట. అసలిదంతా ఎలా జరిగిందంటే..... 'డీజే' లో ఒక సంగీత్ సీన్ కోసం భారీ సెట్ వేయడమే కాక ఆ సీన్ కోసం కొంతమంది మోడల్స్ ని కూడా తీసుకుని వచ్చారట టీమ్ వాళ్ళు. ఈ క్రమంలోనే ఆ మోడల్స్ ఫోటోలని కొంతమంది యూనిట్ సభ్యులు తమ ఫోన్లో ఫొటోస్ తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారట. మాములుగా అయితే చిత్ర యూనిట్, దర్శకుడి అనుమతి లేకుండా ఏ విధమైన పిక్స్ బయటకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఇక్కడ అలా జరగలేదు. అందుకే బన్నీ వారిపై మండిపడ్డాడని సమాచారం.
అందుకే బన్నీ ఇకపై ఎలాంటి ఫొటోస్ బయటకు వెళ్లడానికి వీల్లేదంటూ యూనిట్ సభ్యులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. మరి ఈ జాగ్రత్తలు అసలు హరీష్ తీసుకోవాల్సింది. కానీ ఇక్కడ మాత్రం ఆ బాధ్యతలు బన్నీ తీసుకోవాల్సి వచ్చిందనే కామెంట్స్ వినబడుతున్నాయి.