Advertisement
Google Ads BL

ఇంత లేటుగా స్పందనేమిటి బాబు..!


నాగబాబు 'ఖైదీ...' ప్రీ రిలీజ్ వేడుకలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మని, రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ని రెచ్చగొట్టే మాటలతో కడిగి పారేసిన సంగతి తెలిసిన విషయమే. ఎంత కడుపుమంట లేకపోతె నాగబాబు అంత సంచలన వ్యాఖ్యలు చేసాడో... గాని నాగబాబు స్టేజి దిగకముందే ఒక పక్క వర్మ ట్వీట్స్ తో రెచ్చిపోతే మరోపక్క యండమూరి మాత్రం నాగబాబు కి నాకు ఎటువంటి గొడవ లేదని క్లారిటీ ఇచ్చేసాడు. అయితే ఇది జరిగి ఒక నెల కావొస్తున్నా ఇప్పటివరకు వర్మ ట్వీట్స్ కి యండమూరి మాటలకి స్పందించని నాగబాబు తాజాగా ఇప్పుడు తన స్పందన తెలియ జేశాడు.

Advertisement
CJ Advs

యండమూరి పై తనకెలాంటి కోపము లేదని... ఆయనని ఒక రచయితగా గౌరవిస్తానని... అలాగేఒక గురువులా ఆయన్ని భావిస్తానని కేవలం తన అన్న కొడుకు చరణ్ ని ఆయన వాడు వీడు అని మాట్లాడడం తనకి బాధ కలిగి అలా ఆ ఫంక్టన్ లో మాట్లాడానని... వాడు వీడు అంటే ఆ నొప్పి ఎలా ఉంటుందో యండమూరి  వీరేంద్రనాథ్ కి తెలియాలనే అలా వాడు అని సంబోధించానని చెప్పాడు. ఏదో చిన్నపిల్లాడిని ప్రేమగా అంటే పర్లేదు గాని చరణ్ ని వాడు వీడు అని అనడం సరికాదని... ఎవరన్నా తమని వెధవ అంటే మేము వెధవ అని తిట్టగలమని అలా తిట్టకపోతే నిజంగానే వెధవలమవుతామని అందుకే అలా ఘాటుగా చెప్పాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చాడు.

మరి వర్మ విషయంలో కూడా అలా ఎందుకు అనాల్సి వచ్చిందో ఇప్పటికే వివరణ ఇచ్చిన నాగబాబు తాజాగా యండమూరి కి కూడా ఒక వివరణ పడేసాడు. అసలు నాగబాబు కి ఇన్నిరోజులు తర్వాత స్పందించడానికి కారణమేమిటో.... గాని తన అన్న చిరు చెప్పడం వల్లే నాగబాబు ఇప్పుడు తన వ్యాఖ్యలకు ఒక క్లారిటీ ఇచ్చాడనే గుసగుసలు వినబడుతున్నాయి.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs