Advertisement
Google Ads BL

తమ్ముడిపై నాగబాబు ప్రేమ వెనుక రహస్యం..!


జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఎన్నడూ లేనంతగా ఈ మధ్య అన్నయ్య నాగబాబు అమిత ప్రేమ ఒలకపోస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ప్రారంభించిన కాలంలో తమ్ముడిపై చిర్రు బుర్రులాడిన నాగబాబు అదే పవన్ ఆయన పార్టీ తరఫు నుండే ప్రత్యేక హోదా కోసం యువత చేపట్టిన నిరసనకు మద్దతు తెలపడంతో పవన్ కళ్యాణ్ ను వీరుడు సూర్యుడు అంటూ అన్నయ్య మెచ్చుకోవడం వెనుక ఏదో రహస్యం దాగి ఉందని పేర్కొంటున్నారు విశ్లేషకులు. అప్పట్లో ఇదే నాగబాబు మెగా అభిమానులంతా చిరంజీవి వెనకే ఉండాలనీ, ఆ దిశగా తాను కూడా చిరంజీవి పక్కలోనే ఉంటానని వెల్లడించిన నాగబాబు తర్వాత తర్వాత పవన్ కళ్యాణ్ లో వస్తున్న రాజకీయ పరిపక్వతను గమనించే మరి పవన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ శక్తిగా అవతరిస్తున్నడన్న అనుమానం కలిగిందో ఏమోగానీ నాగబాబు ఉన్న ఫలంగా జై పవన్ కళ్యాణ్ అంటూ తన అభిమానం ద్విగుణీకృతం అయ్యేలా ప్రకటించాడంటే ఆ అభిమానం వెనుక అసలు రహస్యం ఏదో దాగి ఉంటుందని అంటున్నారు రాజకీయ వర్గాలు.  

Advertisement
CJ Advs

ప్రస్తుతం రాజకీయంగా మెల్లిమెల్లిగా చిరంజీవి హవా కనుమరుగవుతుండటంతో అదీ ఈ మధ్య పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఓ కీలక వ్యక్తిగా మారుతుండటంతో అందుకే అప్పట్లో వ్యతిరేకించిన అన్నయ్య ఇప్పుడు అదే పపన్ సైడ్ కి  రావడానికి మెగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ విశాఖ శాంతి నిరసనకు మద్దతు తెలపడాన్ని అభినందించిన నాగబాబు ఇక మెల్లిగా 2019 సాధారణ ఎన్నికల నాటికి జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకొని ఆ దిశగా పావులు కదపడానికి పూర్తి స్థాయిలో సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తుంది.

నాగబాబు తమ్ముడు పవన్ కళ్యాణ్ పట్ల, తన పార్టీ జనసేన పట్ల వ్యక్తపరచిన మాటల్లోని ఆంతర్యాన్నిఒకసారి పరిశీలనగా గమనిస్తే... విశాఖ శాంతియుత ర్యాలి అంశంలో నాగబాబు స్పందిస్తూ... పవన్ జనసేన పార్టీలో తన ప్రమేయం ఎంత వరకు ఉంటుందనేది తనకు తెలియదు గానీ... పవన్ నా సహాయం కోరినట్లయితే... దాన్ని నిరభ్యంతరంగా చేయడానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉంటానని వివరించాడు. తాను ఎప్పుడైనా పవన్ వద్దకు వెళ్ళి పార్టీ తరఫున పని చేస్తానని అడగవచ్చని, అందుకోసం తాను కూడా సరైన సమయం కోసం వేచి  చూస్తున్నాను అంటూ నాగబాబు తెలిపిన విషయం తెలిసిందే. ఇంకా నాగబాబు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పై తనకు కొన్ని విషయాల్లో భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ.. ఇప్పుడు పరిపక్వత చెందుతున్న పవన్ కు మద్దతుగా నిలుస్తాననడంలో తనకు ఎలాంటి సందేహం లేదని వెల్లడించాడు.  మొత్తానికి నాగబాబు మంచి సావకాశంతో అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడన్న మాట. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ మెగా కుటుంబంతో ఎప్పుడూ అంటీ ముట్టనట్లుగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ మధ్యనే జరిగిన ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ కార్యక్రమానికి కూడా పవన్ హాజరుకాకపోవడం తెలిసిందే. ఈ విషయంపై కూడా నాగబాబు స్పందించాడు. చిరంజీవి పట్ల పవన్ కు అపారమైన ప్రేమ ఉందని, కాకపోతే పవన్ ఆ ప్రేమను ఎన్నడూ బయటకు వెళ్ళడించకపోవడంతో అసలు సమస్యకు దారితీస్తుందని ఆయన చెప్పాడు.  ఖైదీ నెంబర్ 150 కార్యక్రమానికి పవన్ రాకపోయినప్పటికీ.. ఇన్నర్ గా  పవన్, చరణ్ కు ఆ సినిమా విషయంలో చాలా సపోర్ట్ చేశాడని అది ఎవరికీ తెలియని విషయమని కూడా ఆయన తెలిపాడు. మొత్తానికి నాగబాబు చాన్నాళ్ళకు పవన్ అంతరంగాన్ని అర్ధం చేసుకొని ఆ దిశగా అవకాశం కోసం చూస్తున్నాడన్న మాట.  

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs