Advertisement
Google Ads BL

చంద్రబాబూ.. విడగొట్టి పాలించడం మానుకో..!


చంద్రబాబునాయుడు అపర చాణక్యుడు. ఎవరిని ఎప్పుడు వాడుకోవాలి.. ఎవరిని ఎప్పుడు దూరంగా పెట్టాలి.. ఎవరికి ఎందుకు పదవులు ఇవ్వాలి.. అనే విషయంలో ఆయనకున్న వ్యూహం అందరికీ తెలిసిందే. స్వర్గీయ ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించింది.. కాంగ్రెస్‌పై ఉన్న వ్యతిరేకత.. తెలుగువారి ఆత్మగౌరవం.. కాంగ్రెస్‌లో సాగుతున్న వంశపారపర్య రాజకీయాలకు వ్యతిరేకంగానే. కానీ ఆయన కూడా చివరి రోజుల్లో రాజీపడి తన స్వార్థం చూపించాడు. తనకు సినిమాలలో, రాజకీయాలలో వారసుడు బాలకృష్ణనే అని ప్రకటించాడు. మరి వారసత్వాన్ని వ్యతిరేకించే ఎన్టీఆర్‌ ఆనాడు ఎందుకు అలా చెప్పాడో అర్ధం కాదు.. వివరణ ఇవ్వడానికి ఆయన బతికిలేడు కాబట్టి ఆయనపై ఇక విమర్శలు సహేతుకం కాదు. ఇక ఎన్టీఆర్‌ మరణం తర్వాత ఆయన రెండోభార్య లక్ష్మీపార్వతి పగ్గాలు చేపట్టాలని భావించింది. 

Advertisement
CJ Advs

దాన్ని అడ్డుకోవాలని భావించిన చంద్రబాబు, బాలకృష్ణ, హరికృష్ణతో పాటు ఇతర నందమూరి వారసులతోపాటు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరి వంటి వారి అండ కూడా తీసుకున్నాడు. ఒక్కసారి పార్టీపై తనకు పెత్తనం వచ్చిన తర్వాత హరికృష్ణ,దగ్గుబాటి వంటి వారిని పక్కనపెట్టాడు. మరోవైపు సినిమా చరిష్మా పార్టీకి అవసరం అని భావించి, బాలకృష్ణను బ్లాక్‌మెయిల్‌ చేయడానికి జూనియర్‌ ఎన్టీఆర్‌ అండ తీసుకున్నాడు. ఆ తర్వాత జూనియర్‌కు కూడా తానే మంచి సంబంధం వెతికి పెళ్లిచేశాడు. మరలా టిడిపి నందమూరి వారి చేతుల్లోకి వెళుతుందనే భయంతో వారిని దూరం పెట్టాడు. అందులో భాగంగానే ముందుచూపుతో బాలకృష్ణ నుంచి తనకు వ్యతిరేకత రాకుండా ఉండటం కోసం ఆయన కూతురిని తన కొడుక్కిచ్చి పెళ్లిచేశాడు. ఇక తన అల్లుడైన నారా లోకేష్‌ను అడ్డుకోలేకుండా బాలకృష్ణని నియంత్రించగలిగాడు. 

కిందటి ఎన్నికల్లో తన అనుభవాన్ని సాకుగా చూపి, అన్నతో విభేదాలున్న పవన్‌ని బుట్టలో వేసుకుని, అతి తక్కువ ఓట్ల శాతంతో జగన్‌ గెలుపుని ఆపాడు. కాపులు ఎక్కువగా ఉండే జిల్లాలలో పవన్‌, గంటా వంటి వారితో ఓట్లు రాబట్టుకోగలగాడు. ఇప్పుడు బాలకృష్ణ రూపంలో తన పార్టీకి కూడా సినిమా గ్లామర్‌ ఉండటంతో జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌లు బాబాయ్‌ బాలకృష్ణతో సయోడ్య కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ వారిని బాలయ్యకు దగ్గరగా రాకుండా చేయడంలో విజయం సాదించాడు. తద్వారా భవిష్యత్తులో తన కొడుకు నారా లోకేష్‌ను టిడిపిలో తిరుగులేకుండా చేసుకోగలిగి, పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాను కట్టబెట్టి త్వరలో పట్టాభిషేకం చేయడానికి సిద్దమవుతున్నాడు. దీనిని చాలా మంది రాజకీయ చతురత అని పొగడవచ్చు.అలా పొగిడే వారికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. రాజకీయాలలో ఎత్తులు.... పై ఎత్తులు సాధారణం అని కూడా అనవచ్చు. 

ఇక కాంగ్రెస్‌లోని వారసత్వ పాలనను తీవ్రంగా ఎండగట్టే వెంకయ్యనాయుడు వంటి వారు కూడా తెలుగుదేశంలో కొనసాగుతున్న వారసత్వ రాజకీయలను ప్రశ్నించకపోవడం మన రాజకీయ నాయకుల మనోదౌర్భాల్యానికి నిలువెత్తు నిదర్శనం. ఇక చంద్రబాబు ప్రత్యేకహోదా విషయంలో అనుసరిస్తున్న ధోరణి కూడా ఆక్షేపణీయం. ప్రత్యేకహోదా కావాలన్నది ఆయనే... పెద్దనోట్ల రద్దు తన ఆలోచన అని చెప్పింది కూడా ఆయనే. ఇక ఇప్పుడు ప్రత్యేకహోదా ముగిసిపోయిన అధ్యాయమని, అదేమీ సంజీవని కాదని అంంటున్నది కూడా ఆయనే. ఇక జిల్లా నాయకులచేత, ముఖ్యంగా వైసీపీ బలంగా ఉన్న నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, అనంతపురం వంటి పలు జిల్లాలో మాత్రం ఆయన తన పార్టీ నాయకుల చేత చేయిస్తున్న ప్రకటనలు దీనికి అద్దం పడతాయి. 

ఉదాహరణకు నెల్లూరు జిల్లా టిడిపి పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ అయిన బీదా రవిచంద్ర తాజాగా తమ పార్టీ ప్రత్యేకహోదా అంశాన్ని ఇంకా విడిచిపెట్టలేదని, తాము ప్రత్యేక ప్యాకేజీతోపాటు ప్రత్యేకహోదాకు కూడా కృషి చేస్తూనే ఉంటామని తెలిపాడు. ప్రత్యేకహోదా ఆనేది గతించిపోయిన విషయమని, మీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు సుజనా చౌదరి వంటివారు కూడా చెప్పారు కదా....! మరి మీరు చెప్పేది మీ వ్యక్తిగత అభిప్రాయమా? లేక పార్టీ నిర్ణయమా? అని ప్రశ్నించిన విలేరులతో ఆయన తాను పార్టీ జిల్లా అధ్యక్షుని హోదాలోనే మాట్లాడుతున్నానని చెప్పడం కొసమెరుపు....! 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs