ఆ మధ్యన 'ఖైదీ...' ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నాగబాబు, రామ్ గోపాల్ వర్మని మాటల తూటాలతో చీల్చి చెండాడిన విషయం తెలిసిందే. ఇక నాగ బాబు వ్యాఖ్యలకు వర్మ ఎంతగా ట్విట్టర్ లో చెలరేగిపోయి ట్వీట్స్ చేసాడో కూడా తెలిసిన విషయమే. అయితే అప్పటి నుండి వర్మకి ఏ కౌంటర్ ఇవ్వకుండా కామ్ గా వున్న మెగా ఫ్యామిలీ ఈ మధ్యన రామ్ గోపాల్ వర్మని కెలకడం మొదలెట్టారు. పవన్ కళ్యాణ్ తాజాగా వర్మని ఫోర్న్ వీడియోలు చూసే వాడితో నాకేంటి అన్నాడు.
ఇక తాజాగా నాగబాబు ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ....అసలు నేను ఆ రోజు కావాలనే వర్మని తిట్టినట్లు చెప్పాడు. అసలు మెగా ఫ్యామిలీని విమర్శించే వారిమీద ఒక విమర్శ చేయడమనేది తప్పు కాదని అలా గనక చెయ్యకపోతే తప్పుచేసిన వాళ్లమవుతామని అన్నాడు. ఇక అన్నయ్యని చిరుని, తమ్ముడి పవన్ ని గనక ఎవరన్నా ఎమన్నా అంటే తాను ఇలాగే ఘాటుగా స్పందిస్తానని చెప్పాడు. అసలు వర్మ చాలా గొప్ప డైరెక్టర్ అని.... తెలుగువారి సత్తాను ముంబైలో చాటిచెప్పి, ఉత్తర భారతీయులకు ఒక గొప్ప గుణ పాఠం నేర్పాడని అన్నాడు.
ఆయన పని ఆయన చేసుకోక గత కొన్నేళ్ల నుంచి వర్మ మెగా ఫ్యామిలీని ఎదో ఒక ట్వీట్ తో గెలుకుతుండడం తనకు నచ్చలేదని..... గబ్బర్ సింగ్ కాస్త... బెగ్గర్ సింగ్ అయిందని అనడం తప్పు కాదా..... చిరంజీవి గారి గురించి మాట్లాడుతూ ఈ గెటప్‌ను జేమ్స్ కామరూన్ చూస్తే ఆశ్చర్యపోతాడని వెటకారం చేయడం కరెక్ట్ కాదు అని ఘాటైన వ్యాఖ్యలు చేసాడు. అసలు మా అన్నదమ్ములెవరూ ఎప్పుడూ వర్మని ఏం అనలేదు. అలాంటి మమ్మల్ని ప్రతి ఒకసారి బాధ పెట్టడం కరెక్ట్ కాదుకదా అని అన్నాడు. అందుకే తన రేంజ్ సమాధానం చెబితే గాని వర్మ తలకెక్కించుకోడని.. అందుకే అలా ఆ రోజు మాట్లాడాల్సి వచ్చిందని అన్నాడు. అసలు తన అన్న చిరంజీవిని ఎవరన్నా ఏమైనా అంటే తాను బ్యాలెన్స్ కోల్పోయి ఇలానే మాట్లాడతానని క్లారిటీ ఇచ్చాడు.