Advertisement
Google Ads BL

ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడండి..!


ప్రత్యేకహొదాకు మద్దతు ఇవ్వకపోయినా, చిరంజీవి, బాలకృష్ణ.. తదితర సోకాల్డ్‌ నాయకులు, హీరోలుగా మౌనంగా ఉన్నా ఫర్వాలేదు..కానీ సుజనాచౌదరి, అశ్వనీదత్‌ వంటి వారిలా నోరు జారితే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఏపీ యువత హెచ్చరిస్తోంది. జాతి అహంకారమో? లేక చంద్రబాబును, వెంకయ్యవంటి వారిని పొడుగుతూ మాట్లాడితే మీకు దక్కే ప్రతిఫలాల కోసమో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మాత్రం ఇక ఎవ్వరూ సహించబోరు. కనీసం మన తెలుగు రాష్ట్రమే అయినా కూడా పక్కన ఉన్న తెలంగాణలో గతంలో జరిగిన ప్రత్యేక రాష్ట్రం విషయంలో రాజకీయాలకు, పార్టీలకు, భావాలకు, మతాలకు, కులాలకు, వయసుకు, వయో బేధానికి తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా పోరాడిన విషయాన్ని గుర్తు చేసుకోండి. అప్పుడు వారి ఏకైక అజెండా కేవలం ప్రత్యేక రాష్ట్రం మాత్రమే. అది సాధించిన తర్వాత మరలా ఎవరి రాజకీయాలు వారు చేస్తున్నారు. తమిళనాడును చూసి బుద్ది తెచ్చుకోండి. కక్కిన కూడు కోసం.. శవాల మీద రాజకీయాలు చేస్తూ, శవాలపై ఉన్న బొరుగులు, పూలు, పైసలు ఏరుకోకండి. ఆత్మాభిమానాలను దెబ్బతీయకండి. సుజనా గారు ప్రత్యేకహోదా పోరాటాన్ని పందుల పోటీతో పోల్చాడు. 

Advertisement
CJ Advs

ఆ తర్వాత కూడా ఆయన దానికి క్షమాపణ చెబుతూ కూడా వ్యంగ్యంగా మాట్లాడిన విషయం అందరికీ అర్దమవుతోంది. ఆయన పందులతో పోరాటాన్ని పోల్చిన తరువాత దానిపై తీవ్ర విమర్శలు వచ్చిన తర్వాత కూడా ఆయన మాట్లాడుతూ, తాను చేసిన వ్యాఖ్యల వల్ల పందుల పోటీలు ఆడేవారి మనోభావాలు దెబ్బతీసి ఉంటే క్షమించమని వెటకారంగా అన్నాడే గానీ, యువత పోరాటాన్ని పందుల పోటీతో పోల్చినందుకు క్షమాపణ చెప్పలేదు. వాస్తవానికి పందుల పోటీలను ఏపీలో మొదట నిర్వహించిన ఘనత అనంతపురం జిల్లాలోని తెలుగు తమ్ముళ్లకే చెందుతుందనేది ఆయనకు తెలుసా? లేదా? ఈ పందుల పోటీలను ఏపీలో మొదలుపెట్టిన ఘనత జె.సి.దివాకర్‌రెడ్దికి, ఆయన సోదరులకే దక్కుతుంది. జెసి దివాకర్‌రెడ్ది వాస్తవానికి సుజనా చౌదరి గారికి చాలా ఆప్తమిత్రులు, ఇద్దరు కలిసి రాత్రుళ్లు మందుకొడతారు... డిన్నర్స్‌ చేస్తారు. కాబట్టి సుజనాచౌదరి జె.సి.దివాకర్‌రెడ్డికి క్షమాపణ చెప్పాడే గానీ ఏపీ యువతకు కాదు. ఇది ఆయన అహంకారానికి మరో నిదర్శనం. మరోపక్క ఎంగిలిమెతుకులకు ఆశపడే నిర్మాత అశ్వనీదత్‌ గురించి అందరికంటే సినీ రంగానికి చెందిన వారికే బాగా తెలుసు. 

ఆయన సినీ ఇండస్ట్రీలో ఎలా ఎదిగాడు? స్వర్గీయ ఎన్టీఆర్‌ తర్వాత చిరుని లైన్‌లో పెట్టిన విషయం.. ఎవరి దగ్గర సాష్టాంగ ప్రణామాలు చేసింది? ఇండస్ట్రీలోని వారికి చిరుపరిచయం. ఆ తర్వాత ఆయన మెగా ప్రొడ్యూసర్‌గా ఎదిగిన విధానం.. చిరంజీవి, రాఘవేంద్రరావులతో చంద్రబాబుకు రికమెండ్‌ చేయించుకొని, విజయవాడకు చిరంజీవిని 'ఇంద్ర' శతదినోత్సవవేడుకలకు పిలిచి, తానంటే అన్ని కులాల వారు వస్తారని, అది తన గొప్పతనమని చెప్పిన ఘనచరిత్ర ఆయనది. ఓ సినిమా వేడుకను కూడా రాజకీయంగా ఎదుగుదలకు వాడుకున్న నీచుడు ఆయన. చివరికి కుల రాజకీయాల కార్డును బయటకు తీసి విజయవాడ ఎంపీగా పోటీ చేసి, అక్కడ ఓడిపోయిన తర్వాత కూడా ఆయనకు అహంకారం దిగలేదు. ఇప్పటికీ ఇలాంటి వారిని మన టాలీవుడ్‌ పరిశ్రమలోని చిరంజీవి, ఎన్టీఆర్‌, మహేష్‌బాబు వంటి వారు ప్రోత్సహిస్తూ ఆయనకు పూర్వవైభవం కలిగించడానికి త్వరలో సినిమాలు చేయడానికి సిద్దంగా ఉన్నారు. 

ఇది శోచనీయం. ఇక ఇక్కడ పవన్‌ ప్రస్తావన కూడా తేవాలి. ఆయన ఎంతో హుందాగా తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చేనేత దుస్తులనే దరించాలనే పిలుపుకు స్పందించిన మాట వాస్తవం. అందుకు ఆయన పద్మశాలీలు తనను కలవడానికి వస్తే రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా చేనేత రంగానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉండటానికి భేషజాలు లేకుండా ఒప్పుకున్నాడు. కానీ దానిని తనను ఇంతవారిని చేసిన పద్మశాలీ, చేనేత రంగ కార్మికులను విస్మరించిన, ఎంపీ నిమ్మల కిష్టప్ప ఇప్పుడు తాజాగా మరో సంచలన వ్యాఖ్య చేశాడు. పద్మశాలీలు అన్నం పెట్టే చంద్రబాబు నాయుడు దగ్గరకు పోకుండా.. ఆకులు ఎత్తేసే పవన్‌ దగ్గరకు వెళ్లడం ఏమిటని? ఆయన ప్రశ్నిస్తున్నారు. 

మరి చంద్రబాబు చేత ఆయన ఇంతకాలం ఆత్మహత్యలు చేసుకుంటున్న చేనేత కార్మికుల దుస్థితిని వివరించి, వారికి సాయం ఎందుకు చేయలేకపోయాడు? అనే దానికి సమాధానం కావాలి. ఇక సినిమా పరిశ్రమలో కూడా కులగజ్జి ఉన్న అశ్వనీదత్‌, బండ్ల గణేష్‌, అల్లు అరవింద్‌, దాసరి.. వంటి వారిని బాయ్‌కాట్‌ చేయాల్సిన సమయంలో ఆసన్నమైంది. ముఖ్యంగా ప్రస్తుతం తాను సంపాదించిన డబ్బును ఎలా ఖర్చుపెట్టాలో తెలియని బొత్స, గంటా, రాయపాటి సాంబశివరావు, గల్లా జయదేవ్‌ వంటి వారు సినిమాలలో పెట్టుబడులు పెట్టాలని, మీడియాలోకి ప్రవేశించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. వారి పట్ల మన హీరోలు కాస్త కఠినంగా వ్యవహరించడం మంచిది. మరి వీటిని ఎందరు పాటిస్తారో? చూడాలి. అతిక్రమించిన వారి చిత్రాలను అందరూ నిషేదించాలి. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs