Advertisement
Google Ads BL

బండ్లకు అన్ని కోట్లు ఎలా వచ్చాయి..?


తాను ఏ స్టార్‌తో సినిమా తీస్తుంటే.. ఆ స్టార్‌ని ఆకాశానికి ఎత్తేస్తూ, తన చిత్రాలను బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలుగా అభివర్ణించే నిర్మాతల్లో కమెడియన్‌ నుండి అగ్ర నిర్మాతగా ఎదిగిన బండ్ల గణేష్‌ ఒకడు. ఆయన బొత్ససత్యనారాయణకు బినామీ అనేది వాస్తవమైన విషయం. కానీ ఆయన మాత్రం తాజాగా మాట్లాడుతూ, తనకు వందల కోట్ల ఆస్తి ఉందని, తనకు 300కోట్లకు పైగా ఆస్తులు, వ్యాపారాలున్నాయని, బొత్సకు బినామీకి ఉండాల్సిన అవసరం తనకు లేదని వ్యాఖ్యలు చేశాడు. తనను బొత్సకు బినామీ అని పత్రికల్లో వచ్చిన వార్తలను చదివి మా అమ్మ ఏడ్చింది. ఏందిరా..! ఇదంతా అని అడిగింది. దాంతో ఇక ఆయనను తాను కలవకూడదని నిర్ణయించుకున్నాను. 

Advertisement
CJ Advs

ఐదేండ్ల తర్వాత మరలా 27వ తేదీన ఆయనను కలిశాను. అది కూడా ఆయన నాకు ఫోన్‌ చేసి, తన కుమారుడికి నాలుగు పెళ్లి సంబంధాలు వచ్చాయని, వాటిల్లో మంచి సంబంధం ఏదో చూసిపెట్టాలని కోరడంతోనే తాను ఆయనతో మాట్లాడానని తెలిపాడు. తన తండ్రి 1.50లక్షలతో షాద్‌నగర్‌లో వ్యాపారం ప్రారంభించి, కోట్లకు పడగలెత్తాడని ఆయన వివరించారు. మరి ఆయన తండ్రి అంత చిన్న మొత్తంతో అతి తక్కువ కాలంలో అన్ని కోట్లకు పడగలెత్తే బిజినెస్‌ ఏమి చేశాడో? ఆయన స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక ఇలా ఎవరెవరి ప్రాపకం కోసమో వెంపర్లాడుతూ, ఎవరితో చిత్రం తీస్తుంటే ఆయా హీరోలను ఆకాశానికెత్తేసే కుల రాజకీయాలు, భజనలు, కీర్తనలు చేయడం ఎల్లకాలం శాశ్వతం కాదనే విషయాన్ని ఆయన గ్రహించాలి. 

తనకున్న సర్కిల్‌ చిన్నదేమీ కాదని, కావాలంటే వారంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఫొటో దిగగలనని ఆయన కొందరిని భయపెట్టే మాటలు మాట్లాడుతున్నాడు. ఆయనకున్న సర్కిల్‌లో ఎవరెవరు ఉన్నారు? అనేది కూడా ఆయన తెలియజేస్తే అందరూ సంతోషించి, ఆయన ఆ స్థాయిలో ఉన్నందుకు సాటి తెలుగువారిగా అందరం కులాలకు అతీతంగా సంతోషపడుదాం. అయినా ఫొటోలు దిగడంతో ఎవరి స్టామినా అయినా తెలియదు. పొట్టకూటి కోసం జాతకాలు చెప్పే కోయదొరలు సైతం తాము పలువురు ప్రముఖులతో ఫొటోలు దిగి, తామే వారికి జాతకాలు చెప్పామని చెబుతుంటారనే విషయం గణేష్‌ గ్రహించాలి. ఇక పవన్‌కు ఆయన స్నేహితుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మాటలను, పొలిటికల్‌ స్పీచ్‌లను రాసిస్తాడనే విమర్శలు కూడా ఎప్పటి నుండో వినిపిస్తున్నాయి. 

ఇందులో తప్పేమి లేదు. పవన్‌ సైతం పలు సందర్భాలలో తనకు అన్ని తెలియవని, అంతటి యంత్రాంగం తనకులేదని, తాను కూడా కొందరు నిపుణులతో మాట్లాడి విషయాలు తెలుసుకుంటున్నానని బహిరంగంగానే చెబుతున్నాడు. గతంతో స్వర్గీయ ఎన్టీఆర్‌కు కూడా పొలిటికల్‌ స్పీచ్‌ల విషయంలో పరుచూరిబ్రదర్స్‌, నాగభైరవ కొటేశ్వరరావు, దాసరి వంటి వారు సాయం చేశారు. చిరుకి కూడా పరుచూరి సోదరులే పోలిటికల్‌ స్పీచ్‌లు రాసిచ్చారు. అదేమి పెద్ద తప్పేం కాదు. తాజాగా పవన్‌కు త్రివిక్రమ్‌ స్పీచ్‌ రాసిస్తాడా? అన్న ప్రశ్నకు బండ్లగణేష్‌కు పూనకం వచ్చింది. కొందరు పనిలేనివారు, పనికిరాని నా కొడుకులు ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారంటూ.. బూతులు ఎత్తుకున్నాడు. 

ఇద్దరూ మేథావులేనని, అలాంటి వారి మధ్య గొడవలు వచ్చేందుకు ఇలాంటి కారుకూతలు వాగుతున్నారంటూ మండిపడ్డాడు. పవన్‌కు ఎవరో స్పీచ్‌లు రాసి ఇవ్వాల్సిన అవసరం లేదని, ఆయనే పదిమందికి రాసివ్వగలడని, ఆయన ఇంట్లో సినిమా సీడీలు, వీడియోలు ఉండవని, ఆయన ఇంటి నిండా పుస్తకాలు ఉంటాయని, ఆయనకు రాసిచ్చేవాడు ఇండియాలో పుట్టలేదని, ఆయనతో రెండురోజులు జర్నీ చేస్తే ఆయన క్యాలిబర్‌, కెపాసిటి, శక్తి ఏమిటో అర్దమవుతాయన్నాడు. 2019లో పవన్‌ నిజమైన హీరో అవుతాడని జోస్యం చెప్పారు. ఇప్పటికిప్పుడు అంటే 2019నాటికి తాను అంత తొందరగా ఎదగాలని, చరిత్ర సృష్టించాలని పవన్‌ సైతం భావించడం లేదు. కానీ ఆయన కంటే ఆయన వీరాభిమానే ఎక్కువగా ఆవేశపడుతున్నాడనే సెటైర్లు వినిపిస్తున్నాయి. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs