Advertisement
Google Ads BL

వెంకయ్యా.. గారడీలు ఎల్లకాలం పనిచేయవు..!


కేంద్రమంత్రి వర్యులు, ఏపీకి బిజెపి, టిడిపి నాయకులు దేవుడిగా భావించే వెంకయ్యనాయుడుగారు మొదటి నుండి తన అనర్గళ ఉపన్యాసాలతో, ప్రాసలతో కూడిన సెటైర్లు వేస్తూ, తెలుగులోనే కాదు... హిందీ, ఇంగ్లీషు వంటి భాషల్లో కూడా అదే పట్టు సాధించి, తిమ్మినిబమ్మిని చేయడంలో సిద్దహస్తుడు. అది దేవుడు ఆయనకిచ్చిన వరం. దాంతో ఆయన ఏ పార్టీ నాయకులలోనైనా వణుకుపుట్టింగలిగిన మాటల మరాఠీ. ఏ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నా, దేశంలో ఏ పార్టీ రాజ్యమేలుతున్నా కూడా ఆయన వారిని తన మాటలతో భయపెట్టి తాననుకున్న పనులను సాధించుకోవడంలో దిట్ట. బయట ఆయన అందరినీ తిడుతాడు గానీ.. అంతర్గతంగా ఆయనకు అందరితోనూ ఎంతో సన్నిహిత సంబంధాలున్నాయి. సోనియా నుండి చిదంబరం వరకు, వైఎస్‌ నుంచి గాలి జనార్ధన్‌రెడ్డి వరకు ఆయనకు చీకటి రాజకీయాల్లో అందరూ సహాయసహకారాలు అందించేవారే. 

Advertisement
CJ Advs

నెల్లూరు జిల్లా నుండి విద్యార్ధి దశ నుంచే రాజకీయాలు మొదలుపెట్టి, ఎమ్మెల్యేగా కూడా గెలిచి, అసెంబ్లీ టైగర్‌గా పేరుపొందాడు. ఇక ప్రత్యక్షరాజకీయాలంటే డబ్బుతో కూడిన వ్యవహారం కాబట్టి, పిల్లికిబిచ్చం కూడా వేయని ఆయన ఆ తర్వాత ఆలోచన మార్చుకున్నారు. ఎంత ఖర్చుపెట్టినా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేననే వాస్తవాన్ని తొందరగానే గ్రహించి, పరోక్ష రాజకీయాలపై కన్నేసి, రాజ్యసభ వంటి దొడ్డిదారిని ఎంచుకున్నాడు. రాష్ట్రంలో బిజెపిని తన చెప్పుచేతల్లో ఉంచుకోవాలని, నాయుడు గారు తన సామాజిక వర్గానికి చెందిన వారినే రాష్ట్ర బిజెపిలో ఎదిగేలా చేయాలని, ఇతర కులాల వారిని అణగదొక్కడం ప్రారంభించాడు. దాంతో ఏపీలో బిజెపి నిలువునా మునిగిపోయింది. ఇక ఆయన ఒకానొక సందర్బంలో తనకు సెంటు భూమి కాదు కదా...! సొంత కారు కూడా లేదని తెలిపాడు. కానీ ఆయన స్వస్థలమైన నెల్లూరు జిల్లావాసులకే కాదు... దేశవ్యాప్తంగా ఆయనకున్న ఆస్తులు, బినామీలు ఎందరికో తెలుసు. స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ను తన కూతురు దీపావెంకట్‌ ఆధ్వర్యంలో మొదలుపెట్టాడు. ఇక తన కొడుకును ఏపీలో బిజెపికి భవిష్యత్తు కూడా లేదని, రాదని, డిసైడ్‌ అయి బిజినెస్‌మేన్‌ అవతారం ఎత్తించాడు. 

ఆయనకు వైజాగ్‌తో పాటు హైదరాబాద్‌, బెంగుళూరు, ఢిల్లీలలో పాటు స్వయాన నెల్లూరులో కూడా కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఒకనాక సందర్భంలో ఆయన 'తాను రాజకీయాల కోసం ఇంట్లో నుంచి.. పదిపైసలు కూడా తేలేదని, అలాగే రాజకీయాలలో పదిపైసలు కూడ సంపాదించలేదని పేర్కొన్నాడు. ఈయన స్టేట్‌మెంట్‌లోని మొదటి భాగం మాత్రమే నిజం.. అంటే ఆయన రాజకీయాల కోసం ఇంట్లో నుంచి, జేబులో నుంచి పదిపైసలు కూడా తీయలేదు. కానీ రాజకీయాలలో పదిపైసలు కూడా సంపాదించలేదన్న రెండో వాక్యం మాత్రం పచ్చి అబద్దం. ఆయన ఇప్పటికీ తనకు అవసరమైనప్పుడు కేవలం పారిశ్రామికవేత్తలు, దొంగ 'బాబు'ల నుంచి విరాళాల రూపంలో డబ్బు సేకరించే ఘనుడు. ఆయనకు సంబంధించిన ఆస్తులపై, ఆయన కూతురు ఆధ్వర్యంలో నడుస్తున్న 'స్వర్ణ భారత్‌ ట్రస్ట్‌'పై ఎప్పటి నుండో తీవ్ర విమర్శలు ఉన్నాయి. 

ఆయన తరచుగా నేను, మోదీ కలిసి ఏపీకి ఎన్నో ప్రసాదిస్తున్నాం.. అంటూ చెప్పిన మాటలు వాస్తవం. దీనినే పవన్‌ తప్పుపట్టాడు. 'ప్రసాదించడానికి' ఆయనేమైనా దేవుడా? అని ఘాటుగా ప్రశ్నించాడు. కాగా ఏపీకి ప్రత్యేకహోదా కోసం పట్టుబట్టిన ఆయన ఆ తర్వాత మాట మార్చాడు. దాంతో నెల్లూరు జిల్లావాసులతో పాటు ఏపీ ప్రజలు కూడా ఆయనపై విమర్శలు మొదలుపెట్టారు. దాంతోపాటు ఆయనకు సంబంధించిన అక్రమాస్తులపై కొందరి వద్ద ఆధారాలున్నాయి. దాంతో మీడియా తనను ఆడుకుంటుందని వెంటనే గ్రహించాడు. అందుకే మోడిని బతిమిలాడి, బామాలి మీడియాకు సంబంధించిన సమాచార ప్రసారశాఖా మంత్రి బాధ్యతలను దక్కించుకున్నాడు. ఇక తనను మీడియా విమర్శిస్తే సహించబోనని చెప్పి, కొందరిపై భౌతికదాడులు చేయించాడు. ఇక తనను విమర్శిస్తే మీడియాకు అతి కీలకమైన ఆదాయవనరు అయిన కేంద్రప్రకటనలను, దాంతోపాటు చంద్రబాబు నాయుడితో చెప్పి, రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనలను కూడా ఇప్పించనని మీడియాను భయపెట్టాడు. 

దీంతో పాటు కేంద్రంలో కూడా ఆయన ఆడిందే ఆట..పాడిందే పాట కావడంతో తనకున్న పలుకుబడిని ఉపయోగించాడు. ఇక ఏపీలో మీడియా ఎక్కువగా ఒకరిద్దరి చేతిలోనే బంధికావడం గమనించి, వారిని తన దారికి తెచ్చుకున్నాడు. అందుకే సాక్షాత్తు జగన్‌ నుంచి చిరంజీవి వరకు, చంద్రబాబు నుంచి కిందిస్థాయి నాయకుల వరకు ఆయన్ను విమర్శించే సాహసం ఎవ్వరు చేయలేరు. ఇక వీరుడిని, శూరుడిని అని చెప్పుకునే జగన్‌ కూడా ప్రత్యేకహోదాపై అందరినీ విమర్శిస్తాడు కానీ మోదీ, వెంకయ్యనాయుడులను ఎదిరించలేడు. కేసీఆర్‌ లాంటి వాడు కూడా వెంకయ్యను విమర్శించే ధైర్యం చేయడు. కానీ మొదటి సారిగా ఆయనకు పవన్‌ రూపంలో ఘాటైన విమర్శలు ఎదురయ్యాయి. పవన్‌ మాట్లాడింది అక్షర సత్యం. ఆయన్ను ఎదిరించే మొనగాడు వచ్చాడు. 

అదే నేడు ఏపీ ప్రజలను సంతోషపరుస్తున్న అంశం. ఇక ఆయన పవన్‌ను ట్విట్టర్‌పులిగా పేర్కొంటున్నాడు. దమ్ముంటే ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాలని సవాల్‌ విసురుతున్నాడు. మోదీని మించిన ట్విట్టర్‌పులి ఎవరూ లేరనేది వాస్తవం. మోదీ కేవలం సోషల్‌ మీడియాను ఉపయోగించుకున్నంతగా, ఆ పార్టీ నాయకులు దానిపై పెట్టిన శ్రద్ద, మీడియాపై పెట్టిన శ్రద్ద మరెవ్వరూ పెట్టలేదన్నది వాస్తవం. మరి ఆయన పవన్‌ను ట్విట్టర్‌ పులి అనడం ఎంతవరకు సమంజసం. ఇక ఆయన తాజాగా ఫాలోయర్స్‌ లేని ట్వీట్స్‌ అనవరం అన్నాడు. మరి మోదీ కంటే పోర్న్‌స్టార్‌ సన్నిలియోన్‌కు ఉన్న ఫాలోయిర్స్‌ ఎక్కువనే సంగతి ఆయన గుర్తించాలి. 

మరోపక్క పవన్‌కు దమ్ముంటే ప్రత్యక్షరాజకీయాలలోకి రావాలంటున్నాడు. మరి వెంయ్యకు దమ్ముంటే దేశంలో ఎక్కడి నుంచైనా ప్రత్యక్షఎన్నికల్లో నిలబడి లోక్‌సభకు ఓట్లతో గెలవగలడా? ఇక స్వర్ణ బారత్‌ ట్రస్ట్‌ నిస్వార్దసేవలు అందిస్తోందని, ప్రజల విరాళాలతో నడుస్తోందని ఆయనతో పాటు కామినేని శ్రీనివాస్‌, మాణిక్యాలరావు వంటి వారు అంటున్నారు. ఇప్పటికే తమ ట్రస్ట్‌ ద్వారా 20వేల మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించామంటున్నారు. దమ్ముంటే.. ఆలా ఆయన ట్రస్ట్‌ ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిన వారి పేర్లను, అడ్రస్‌లను తెలపాలి. ఇక ఆయన ట్రస్ట్‌కు ప్రజలు ఇచ్చిన విరాళాలను ప్రకటించాలి. ఆ ట్రస్ట్‌లో జరుగుతున్న లావాదేవీలు, ఎవరు ఎవరు విరాళాలు ఇస్తున్నారు? ఆ ట్రస్ట్‌కు ఎన్ని ఆస్తులున్నాయి? ఆయనకు ఎన్ని ఆస్తులు, ఆయన కూతురు, కొడుకు, అల్లుడిపేర ఎన్ని ఆస్తులున్నాయో ప్రకటిస్తే.. ఆయనతో బహిరంగ చర్చకు జిల్లా వాసులు ఎందరో, జిల్లాకు చెందిన నిజాయితీ కలిగిన జర్నలిస్ట్‌ కూడా తమ వద్ద ఉన్న ఆధారాలతో సహా బయటపెట్టడానికి రెడీ అని సవాల్‌ విసురుతున్నారు.వెంకయ్యా.. ఇకనైనా నీ గురువింద గింజ నీతి చాలించు. 

చిన్న రాష్ట్రాలు మా సిద్దాంతం అని చెప్పిన ఆయన పవన్‌ అడిగినట్లు మహారాష్ట్ర నుంచి విదర్భను, తమిళనాడులోని ప్రత్యేక రాష్ట్రం డిమాండ్‌ను, యూపీని నాలుగు రాష్ట్రాలుగా విడగొట్టాలనే డిమాండ్‌ను ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు. లోక్‌సభలో పూర్తి మెజార్టీ ఉన్న బిజెపి ఎందుకు ఆ విషయం పట్టించుకోవడం లేదు? రాష్ట్రం నుండి కాకుండా పరాయి రాష్ట్రాల నుంచి ఎందుకు రాజ్యసభకు ఎన్నికవుతున్నావు? వంటి వాటికి దమ్ముంటే సమాధానం చెప్పు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs