Advertisement
Google Ads BL

తప్పు చేస్తుందొక్కరు..ఫలితం ముస్లింలందరిపై!


ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు ఇస్లామిక్‌ ఉగ్రవాదం పెరిగిపోతోంది. దీంతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంతో పాటు చివరకు వారం ముందు అమెరికన్‌ ప్రెసిడెంట్‌గా పదవిని అలంకరించిన డోనాల్డ్‌ ట్రంప్‌ వరకు ముస్లింల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనిపై వ్యతిరేకత రావడం, విమర్శలు రావడం సహజమే. కానీ మోదీ నుండి ట్రంప్‌ వరకు ఈ నిర్ణయాలను చిత్తశుద్దితో అమలు చేయాల్సిన ఆవశ్యకత కనిపిస్తోందని ఎందరో భావిస్తున్నారు. కాగా 'జల్లికట్టు' ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ఏపీలో ప్రత్యేక హోదా ఉద్యమం, కర్ణాటకలో కంబళ ఉద్యమం వంటివి మరలా ఊపందుకుంటున్నాయి. కానీ ఇదే విషయంలో కొందరు మత చాందసులు మాత్రం ఆ స్ఫూర్తిని పెడదోవ పట్టించేలా తమ వర్గం యువతను పక్కదారి పట్టిస్తున్నారు. తాజాగా చెన్నైలో ఓ ముస్లిం యువకుడైన జల్లికట్టు ఆందోళన కారుడు తన ద్విచక్రవాహనంపై బిన్‌లాడెన్‌ బొమ్మను అంటించుకుని తిరుగూ మీడియా కంటికి చిక్కాడు. దీంతో దేశవ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశం అయింది. మరోపక్క మతతత్వాన్ని పెంచిపోషించే పార్టీ, కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌లకు కూడా మిత్రపార్టీ అయిన ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. 

Advertisement
CJ Advs

తాజాగా ముస్లింలు మూడుసార్లు తలాక్‌లు చెప్పి, భార్యలకు విడాకులిచ్చే విషయంపై కేంద్రప్రభుత్వంతో పాటు సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. కాగా అసదుద్దీన్‌ ముస్లిం యువతను ఉద్దేశించి మాట్లాడుతూ, తమిళ ప్రజలకు ఎలాంటి సంప్రదాయాలు ఉన్నాయో.. ముస్లింలమైన మనకు కూడా ప్రత్యేక సంప్రదాయాలు ఉన్నాయని, వాటిని పరిరక్షించుకునేందుకు ఉద్యమానికి సిద్దం కావాలని దేశావ్యాప్త ముస్లింలకు పిలుపునిచ్చాడు. తలాక్‌లు చెప్పి విడాకులు తీసుకోవడం, మరలా పెళ్లిళ్లు చేసుకోవడం తమ సంప్రదాయమని, దానిని ఎవ్వరూ ఆపలేరని, కాబట్టి ఈ విషయంలో ముస్లిం యువత ఐక్యం కావాలని పిలుపునివ్వడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. 

మరో పక్క ఇండియాలో క్రికెట్‌కు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. ఇక్కడ అది ఒక మతంతో సమానం. స్వాతంత్య్రం వచ్చిన ఇంతకాలానికి నిత్యం దాడులతో అతలాకుతమయ్యే కాశ్మిర్ నుండి ఓ యువ క్రికెటర్‌ పర్వేజ్‌ రసూల్‌ దేశ జట్టులోకి వచ్చాడు. ఆయనను గతంలోనే టీమ్‌కు ఎంపిక చేసినప్పటికీ ఇప్పటివరకు అతనికి దేశం తరపున ఆడే అవకాశం రాలేదు. దాంతో మత, కులాలకు అతీతంగా దేశంలోని క్రికెట్‌ అభిమానులందరూ ఆయనను తుదిజట్టులోకి తీసుకోవాలని కోరారు. ఎట్టకేలకు తాజాగా జరిగిన ఇంగ్లాండ్‌తో ట్వంటీ-20 మ్యాచ్‌లో ఆయనకు తుదిజట్టులో స్థానం దక్కింది. దీంతో అందరూ ఎంతో గొప్పగా సంబరపడ్డారు. ఈ మ్యాచ్‌ రిపబ్లిక్‌ డే సందర్భంగా జరిగింది. ఆటకు ముందు ఇరు జట్ల జాతీయ గీతాలను ఆలపించారు. కానీ పర్వేజ్‌ రసూల్‌ మాత్రం కనీసం జాతీయ గీతానికి పెదవులైనా కదిలించకుండా చూయింగ్‌ గమ్‌ నములుతూ, నిర్లక్ష్యంగా నిలబడటం చూసిన వారికి కడుపు మండిపోయింది. కాగా ఇదే ఆటగాడు గతంలో రంజీట్రోఫీలో బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌కు హాజరయ్యాడు. కానీ టెలిగ్రాఫ్‌ పత్రిక అతని వద్ద మందు గుండు సామగ్రి ఉందనే కథనాన్ని ప్రచురించింది. దీంతో పోలీసులు ఆయనను అణువణువూ తనిఖీ చేశారు. కానీ ఓ క్రికెటర్‌ను అలా అవమానించడం తప్పని దేశ వ్యాప్తంగా మతాలకు అతీతంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. గతంలో అజారుద్దీన్‌ కెప్టెన్‌గా ఉన్నప్పుడు జరిగిన ప్రపంచకప్‌ మ్యాచ్‌ సందర్భంగా ఆయన కూడా జాతీయ గీతాన్ని ఆలపించకుండా, కనీసం చేతులు కూడా కట్టుకోకుండా, పెదాలను కూడా కదపకుండా, ఇలాగే బబుల్‌గమ్‌ నములుతూ, తీవ్ర విమర్శలకు గురైన సంగతి క్రికెట్‌ ప్రియులకు ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. మరి సినిమా థియేటర్లలో కూడా జాతీయగీతాన్ని ప్రదర్శించాలని, ప్రేక్షకులందరూ విధిగా లేచి నిలబడి జాతీయ గీతాన్ని ఆలపించాలని ఆదేశాలు జారీ చేసిన కోర్టులు ఈ విషయంలో ఎలా స్పందిస్తాయో చూడాలి...! 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs