Advertisement
Google Ads BL

చిరు, పవన్ ను హేళన చేసిన నటి..!


ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, కృష్ణ, కృష్ణంరాజుల కాలం నుంచి నేటి వరకు వెండితెరపై ఓ వెలుగు వెలుగుతోన్న నటి సహజనటి జయసుధ. కాగా ఈమె రాజకీయాల్లో కూడా ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఈమెను తాజాగా ఓ మీడియా వారు రాజకీయాలపై కొన్ని ప్రశ్నలు సంధించారు. మీరు 'జనసేన' పార్టీలో చేరబోతున్నారా? అంటే 'జనసేన' అంటే ఎవరి పార్టీనో తెలియదని వ్యాఖ్యానించింది. తనకు పవన్‌కళ్యాణ్‌ పార్టీ అంటేనే తెలుస్తుంది తప్ప 'జనసేన' అంటే తెలియదని వ్యాఖ్యానించింది. ఆయన మనోభావాలు బాగున్నాయని తెలిపింది. నేను అందరినీ సపోర్ట్‌ చేస్తాను. ఎవరు కష్టపడితే వారే గెలుస్తారంది. కాగా అప్పట్లో కూడా తనను చిరంజీవి స్థాపించిన 'ప్రజారాజ్యం' పార్టీలో చేరుతారా? అని మీడియా అడిందని, చివరకు ఆయనే తమ కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారని సెటైర్‌ విసిరింది. ఇక పవన్‌కళ్యాణ్‌ రాజకీయాలకు పనికిరాడని కొందరు చేస్తున్న విమర్శలపై ఆయన వీరాభిమాని నిర్మాత, కమెడియన్‌ బండ్లగణేష్‌ తీవ్రంగా స్పందించాడు. నిజమే... పవన్‌కు మిగిలిన రాజకీయనాయకులలాగా కుంభకోణాలు చేయడం రాదు.. ప్రాజెక్ట్‌లలో కమిషన్లు తీసుకోవడం, స్కామ్‌లు, స్కీమ్‌లను రచించడం చేతకాదు. కానీ ప్రజాసేవ చేయాలన్న దృడసంకల్పం ఆయనకుఉంది. ప్రజాసేవ చేయాలనే తపన ఉన్న వ్యక్తి... ఆవేశంతో మంచి రాజకీయ నిర్ణయాలు తీసుకోగలిగిన వ్యక్తి రాజకీయాల్లోకి పనికిరాడా? అని ప్రశ్నించారు. 

Advertisement
CJ Advs

ఏదో ఒకరోజున పవన్‌ కళ్యాణ్‌ సీఎం కావడం తథ్యమని జోస్యం చెప్పారు. నిజాయితీ కలిగిన ఆయనకు దేవుడిచ్చే బహుమతి అదేనని వ్యాఖ్యానించాడు. కాగా నిన్న పవన్‌ చేసిన ప్రసంగం అద్భుతంగా ఉన్నప్పటికీ వర్మకు సంబంధించిన వ్యక్తిగత జీవితంలోకి పవన్‌ వెళ్లకుండా ఉండాల్సిందని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో ఇప్పటికే వర్మ కూడా పవన్‌ మూడుపెళ్లిళ్ల విషయాన్ని తానెప్పుడు ప్రశ్నించలేదని, అది వారి వ్యక్తిగత జీవితమని, నా జీవితం ఎలా ఉంటుంది? నా లైఫ్‌స్టైల్‌ఏమిటి? వంటి విషయాలన్నీ ఇప్పటికే 'నా ఇష్టం' పుస్తకం ద్వారా వెల్లడించానని, తన జీవితం తెరచిన పుస్తకంవంటిదని వ్యాఖ్యానించడంతోపాటు ఎంతో హుందాగా పవన్‌కు, జనసేనకు, మెగాభిమానులకు బెస్టాఫ్‌లక్‌ చెప్పి తన హుందాతనాన్ని చాటుకున్నాడని ప్రశంసలు లభిస్తున్నాయి. ఇక పవన్‌ అన్ని కులాలను, వర్గాలను, మతాలను కలుపుకోనిపోనిదే ప్రభుత్వం నడవదంటున్నాడు. మరి కులాలను, మతాలను, మహిళలను,అందరినీ కలుపుకుపోవడమంటే మతం పేరిట, కులం పేరిట. లింగబేధాల పేరిట వారిని బుజ్జగిస్తూ, ఓటు రాజకీయాలు చేస్తూ, వారిని ప్రత్యేక ప్రజలుగా భావించి, సంతృప్తిపరచడేమనా? అనే ఘాటు విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs