Advertisement
Google Ads BL

మరోసారి వివాదంలోకి మహేష్‌...!


మురుగదాస్‌కి సామాజిక స్పృహ చాలా ఎక్కువ. ఆయన తన చిత్రాలలో మద్యం తాగే సీన్లను చూపించడు. కానీ 'కత్తి'కి రీమేక్‌గా వచ్చిన 'ఖైదీ..' చిత్రంలో స్వయంగా హీరో చిరంజీవే మద్యం సేవిస్తూ కామెడీ పంచుతాడు. దీంతో మురుగదాస్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడని కూడా అందరికీ తెలిసిందే. కాగా ఆయన 'కత్తి' చిత్రానికి ముందు శీతలపానీయాలను బాగా సేవించేవాడట. కానీ ఒక్కసారి 'కత్తి' సినిమా కథ కోసం రీసెర్చ్‌ చేస్తున్న క్రమంలో ఆయనకు శీతలపానీయాల వల్ల జరిగే నష్టాలు, గ్రామాలలోని, ఇతర ప్రాంతాలలోని భూగర్భ జలాలు ఎలా దుర్వినియోగం అవుతున్నాయి? ఆయా శీతల కంపెనీల వ్యర్ధ పదార్ధాల వల్ల ఇతర ప్రకృతి సంపద కూడా ఎలా విధ్వంసం అవుతుందో ఆయనకు తెలిసివచ్చిందట. అందుకే ఆనాటి నుండి ఆయన శీతలపానీయాలను తాగడం మానివేయడమే కాదు.. తన షూటింగ్‌ సమయంలో వాటి వినియోగాన్ని కూడా నిషేదించాడు. ఈ విషయాన్ని ఆయన ట్విట్‌ చేశాడు. 

Advertisement
CJ Advs

కాగా ఈయన ఆ ట్వీట్‌ చేసిన వెంటనే తమిళనాడు యువత ఆ చిత్ర హీరో, తమిళస్టార్‌ విజయ్‌ కోక్‌ అంబాసిడర్‌గా బాటిల్స్‌ను చూపిస్తూ, వాటిని తాగమని చెప్పే ఫొటోలను, వీడియోలను పోస్ట్‌ చేసి, నిబద్దత దర్శకుడు ఒక్కడికే ఉంటే చాలదు.. హీరోలకు కూడా ఉండాలి.. అనే విమర్శలు సంధించారు. ప్రస్తుతం తమిళనాడులోని సినిమా థియేటర్లలో 90శాతం థియేటర్లలో శీతలపానీయాలను అమ్మడం నిషేదిస్తూ వ్యాపార వర్గాలు నిర్ణయం తీసుకున్నాయి. వాటి స్థానంలో స్థానికంగా తయారయ్యే గోలిసోడా, కలర్‌సోడా, నిమ్మకాయ సోడాల వంటి వాటిని విక్రయిస్తున్నారు. దీనిపట్ల తమిళ యువత హర్షం వ్యక్తం చేస్తోంది. 

కాగా ప్రస్తుతం మురుగదాస్‌ మహేష్‌బాబుతో ఓ ద్విభాషా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఓ శీతల పానీయానికి మహేష్‌ సైతం బ్రాండ్‌ అంబాసిడర్‌. సో... రేపు ఈ చిత్రం విడుదలైన తర్వాత కూడా మురుగదాస్‌ని వెక్కిరిస్తూ మహేష్‌ తాగే శీతలపానీయాలను ప్రేక్షకులు పోస్ట్‌ చేస్తారు. దీంతో పాపం.. మురుగదాస్‌ పరిస్థితి ఇబ్బందుల్లో పడింది. మరి 'శ్రీమంతుడు' తరహాలో మహేష్‌ కూడా శీతల పానీయాల ప్రకటనలకు స్వస్తి పలకాలని ఏపీ యువత కోరుతోంది. మరోపక్క ప్రస్తుతం మహేష్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా పనిచేస్తున్న శీతల పానీయానికి ఒకప్పుడు మెగాస్టార్‌ చిరంజీవి బ్రాండ్‌ అంబాసిడర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. దాని పోటీ కంపెనీకి ప్రచారం చేసిన పవన్‌ ఆ తర్వాత తన తప్పు తెలుసుకుని అలాంటి వాణిజ్య కంపెనీలకు పనిచేయకూడదని నిర్ణయించుకున్నాడు. కానీ చిరుకు మాత్రం ఇంకా ఆ విషయం బోధపడలేదని, అందుకే 'కత్తి'కి రీమేక్‌గా తెరకెక్కించిన 'ఖైదీ నెంబర్‌ 150' చిత్రంలో గ్రామీణులు, రైతులు కార్పొరేట్‌ సంస్థల వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను చూపించారే గానీ.. ఆయా కార్పొరేట్‌ కంపెనీలు శీతల పానీయాల సంస్థలు అనే విషయానికి ప్రాధాన్యం ఇవ్వకుండా చూశారనే విమర్శలు కూడా చెలరేగుతున్నాయి. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs