బాలీవుడ్ కింగ్‌ఖాన్ షారుఖ్‌ఖాన్‌కు 'దిల్‌వాలే, ఫ్యాన్' వంటి డిజాస్టర్స్ తర్వాత మరలా ఆయన తాజా చిత్రం 'రాయిస్' మంచి ఊపునిస్తోంది. మూడేళ్లుగా సరైన హిట్‌లేని ఆయన నటించిన ఈ చిత్రం మొదటి రోజు 30కోట్లు వసూలు చేసింది. కాగా ఈ చిత్రంలో షారుక్‌తో పాటు నవాజుద్దీన్ సిద్దిఖి నటన, కథ, కథనాలు బాగుండటంతో పాటు పక్కా యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందడంతో తమ అభిమాన హీరో షారుఖ్ ఫ్యాన్స్ ప్రపంచవ్యాప్తంగా ఊగిపోతున్నారు. కాగా ఈ చిత్రంలో మరో స్పెషల్ అట్రాక్షన్ ఇప్పుడు యువతను ఉర్రూతలూగిస్తోంది. ప్రముఖ పోర్న్‌స్టార్, బాలీవుడ్ సెక్సీ సుందరి సన్నిలియోన్ చేసిన ఐటం సాంగ్‌కు విపరీతమైన స్పందన లభిస్తోంది. ఈ పాటను చూసి కిందిస్ఠాయి మాస్ ప్రేక్షకులు మత్తెక్కిపోతున్నారు. 80వ దశకంలో విడుదలైన 'ఖుర్బానీ' చిత్రంలోని 'లైలా ఓ లైలా' పాట ఆ రోజుల్లో పెద్ద సంచలనం సృష్టించింది. ఈ పాటలో అలనాటి బాలీవుడ్ శృంగార తార జీనత్ అమన్ నర్తించింది. ఈ పాటను తాజాగా రీమిక్స్ చేసి 'రాయిస్' చిత్రంలో సన్నిలియోన్ చేత చేయించారు. ఈ పాటకు ఈ చిత్రం ఆడుతున్న థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. ఫ్యాన్స్ ఈ పాటకు రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ పిచ్చి ముదిరి ఏకంగా థియేటర్లలోని స్క్రీన్‌లపై పడి యువత వాటిని చింపివేస్తున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి.
కాగా తనకు ప్రస్తుతం వయసు మీద పడిందని, కాబట్టి తాను ఇక శృంగార, రొమాంటిక్ సన్నివేశాలలో నటించనని ఇటీవలే షారుక్ చెప్పాడు. తన చిత్రాలలో కూడా మహిళలను కించపరిచే విధంగా చూపించనని ప్రామిస్ చేశాడు. మహిళలను కించపరిచేలా వ్యవహరిస్తే తన బిడ్డలనైనా నరికిచంపుతానని శపథం చేశాడు. మరి ఈ పాటను చూసిన సినీ విశ్లేషకులు ఇంత మంచి చిత్రంలో ఆ ఒక్కపాట అవసరమా? షారుఖ్ లాంటి హీరోకు కూడా ఇలా చేయకతప్పడం లేదా? ఆయన తాజాగా చేసిన వాగ్దానాలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. కాగా షారుక్ చిత్రమంటే వాస్తవానికి 5వేల స్క్రీన్స్‌లో విడుదల కావాలి. కానీ ఈచిత్రం 'కాబిల్' కారణంగా కేవలం 2700 స్క్రీన్లలో మాత్రమే విడుదలవ్వడంతో ఈ చిత్రానికి తొలిరోజు అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాలేదని, కానీ లాంగ్ వీకెండ్ ఉండటంతో ఈచిత్రం మొదటి వారంలో 100 కోట్లు వసూలు చేస్తుందని, ట్రేడ్‌వర్గాలు విశ్లేషిస్తున్నాయి.