మొత్తానికి 'బెంగాల్‌టైగర్' తర్వాత సినిమాలకు దూరంగా ప్రపంచ పర్యటనలో గడిపిన మాస్‌మహారాజా రవితేజ తాజాగా రెండు చిత్రాలను అఫీషియల్‌గా ఓకే చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన అభిమానులు సంబరపడిపోతున్నారు. అందులో ఒకటి దిల్‌రాజు నిర్మాతగా అనిల్‌రావిపూడి దర్శకత్వంలో చేసే చిత్రం కాగా, మరో చిత్రం కొత్త దర్శకుడు విక్రమ్‌సిరితో రూపొందనుంది. ఈ చిత్రానికి ఆల్‌రెడీ 'టచ్ చేసి చూడు' అనే టైటిల్‌ను ప్రకటించి, ఫస్ట్‌లుక్‌ని కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రవితేజ తన సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నాడు. ఇప్పటికే ఓ హీరోయిన్‌గా రాశిఖన్నాను ఎంపిక చేశారు. ఇక మరో హీరోయిన్‌గా లక్కీగర్ల్ అనిపించుకుంటూ... ఈమధ్య గోల్డెన్‌లెగ్‌గా మారిన లావణ్యత్రిపాఠిని ఎంపిక చేశారు. 'భలే భలే మగాడివోయ్' చిత్రంలో నాని సరసన, 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రంలో ఏకంగా కింగ్ నాగార్జున సరసన, హిట్టే లేక అల్లాడుతున్న అల్లు వారి హీరో అల్లు శిరీష్ సరసన ఈమె 'శ్రీరస్తు.. శుభమస్తు' చిత్రాలలో నటించింది. రెండు చిత్రాలతో బ్లాక్‌బస్టర్స్‌ను, మరో చిత్రంతో హిట్‌ను అందుకున్న ఈ 'అందాల రాక్షసి' లావణ్యత్రిపాఠి.. రవితేజ సరసన నటించనుంది. మరి ఈమె గోల్డెన్‌లెగ్ రవితేజకు కూడా కలిసి వచ్చి ఆయన కెరీర్‌ను మరలా గాడిలో పెడుతుందో లేదో వేచిచూడాల్సివుంది....!
ఇక ఆయన అనిల్‌రావిపూడితో చేయనున్న చిత్రం సరికొత్త ట్రెండ్‌కు నాంది పలుకుతుందనే ప్రశంసలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఈచిత్రంలో రవితేజ అంధునిగా కనిపించనున్నాడని ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. దానిని కన్‌ఫర్మ్ చేస్తున్నట్లుగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌లో 'వెల్‌కం టు మై వరల్డ్' అంటూ రవితేజ చేతిలో కర్రతో కనిపిస్తున్నాడు. మాస్‌మహారాజాతో ఇలాంటి సబ్జెక్ట్ అంటే రిస్కే. తన కెరీర్‌లో ఒకటిరెండు మినహా రవితేజ పెద్దగా ప్రయోగాలు చేయలేదు. ఆయన చేసిన చివరి ప్రమోగం 'నా ఆటోగ్రాఫ్.. స్వీట్ మెమరీస్' తర్వాత మరలా 'రాజా ది గ్రేట్'తో రవి మరో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుడుతున్నాడనే చెప్పాలి. ఈ చిత్రం కథ రామ్, ఎన్టీఆర్‌ల వద్దకు వెళ్లినప్పటికీ, స్టోరీ వాళ్లకు నచ్చినప్పటికీ అంధునిగా కమర్షియల్ హీరో నటిస్తే చూస్తారా?అన్న అనుమానమే వారిని వెనకడుగేయించింది. కానీ తన మొదటి రెండు చిత్రాలైన 'పటాస్, సుప్రీం'లతో రొటీన్ కథలనే డిఫరెంట్‌గా, కమర్షియల్‌గా చూపించడంలో సక్సెస్ అయిన అనిల్‌రావిపూడి ఈ బ్లైండ్ స్టోరీకి రవిని ఒప్పించాడంటే గ్రేట్ అనే చెప్పాలి. కాగా ఈ చిత్రం కూడా పక్కా కమర్షియల్‌గా ఉంటుందని అనిల్ ఎంతో నమ్మకంగా చెబుతుండటం విశేషం.