సినిమాలలో ఎంత అందాలను ఆరబోసినా కూడా హాట్‌సుందరి లక్ష్మీరాయ్‌కి హీరోయిన్‌గా గుర్తింపు రాలేదు. ఇక ఏకంగా నాటి ఇండియన్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనితో ఎఫైర్ ద్వారా వార్తల్లో ఉండాలనుకున్నా.. ఆ విషయంలో కూడా ఆమెకు నిరాశే ఎదురైంది. కాగా ప్రస్తుతం ఈ భామకు ఐటంగర్ల్‌గా మాత్రం మంచి గుర్తింపు లభిస్తోంది. తమ్ముడు పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌తో ఆమె 'సర్దార్ గబ్బర్‌సింగ్'లో ఓ సాంగ్ లో నర్తించింది. ఆ పాటకు ఆడియో పరంగా, థియేటర్లలో కూడా మంచి రెస్పాన్స్ లభించినా, చిత్రం డిజాస్టర్ కావడంతో ఆమె నిరాశపడింది. కానీ అన్నయ్య మెగాస్టార్ కంట్లో పడింది. ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసిన తన 150వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150' చిత్రంలో ఏకంగా డ్యాన్స్ కింగ్ చిరుతో స్టెప్పులేసే అరుదైన అవకాశం లభించింది. ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో పాటు ఆమె చిరుతో చేసిన 'రత్తాలు.. రత్తాలు...' పాట చిత్రానికి పెద్ద కిక్‌నిచ్చింది. చిరుతో ధీటుగా స్టెప్స్ వేసి అదరగొట్టింది. దీంతో ప్రస్తుతం ఈ భామకు ఐటం గర్ల్‌గా పలు చిత్రాలలో మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. స్టెప్స్ విషయంలో చిరుతో ధీటుగా చేయగలడన్న పేరును తెచ్చుకున్న నేటితరం యంగ్‌స్టార్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కన్ను ప్రస్తుతం ఈ అమ్మడిపై పడింది. త్వరలో తాను బాబి దర్శకత్వంలో చేయనున్న చిత్రంలోని ఓ ఐటం సాంగ్‌లో ఆమె ఎన్టీఆర్‌తో కలిసి డ్యాన్స్ వేయనుందని సమాచారం. ఇప్పటికే ఆమె ఈ చిత్రంలో పాటకు గ్రీన్‌సిగ్నల్ కూడా ఇచ్చిందట.
'జనతాగ్యారేజ్' చిత్రం తర్వాత ఎన్నోకథలు, ఎందరో దర్శకులను పరిగణనలోకి తీసుకున్న ఎన్టీఆర్ ఎట్టకేలకు ఫ్లాప్‌ల్లో ఉన్న యంగ్ డైరెక్టర్ బాబి దర్శకత్వంలో నటించడానికి ఓకేచెప్పిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ నటిస్తోన్న ఈ 27వ చిత్రానికి ఎన్టీఆర్ అన్నయ్య నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మాత కాగా, ఆయన తన బేనర్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్ లో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నాడు. ఈ చిత్రానికి ఇప్పటికే 'జై.. లవ..కుశ' అనే టైటిల్‌ను పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయనున్నాడని, అందులో ఒక పాత్ర 'అదుర్స్'లోని చారి పాత్ర తరహాలో కామెడీగా ఉంటుందని, మరో పాత్ర పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా, మూడోపాత్ర '24' చిత్రంలోని సూర్య చేసిన ఆత్రేయ పాత్ర తరహాలో ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇక ఈచిత్రాన్ని ఫిబ్రవరి11న ప్రారంభించి, ఆగష్టు11న విడుదల చేయనున్నారని సమాచారం. మరి చిరుతో మెప్పించిన ఈ భామ మరో డ్యాన్సింగ్ సెన్సేషన్ అయిన యంగ్‌టైగర్‌ను ఎలా ఎదుర్కోనుందో వేచిచూడాల్సివుంది. కాగా ఈ చిత్రానికి కూడా దేవిశ్రీప్రసాదే సంగీతం అందిస్తుండటం గమనార్హం.