Advertisement
Google Ads BL

వావ్‌... వర్మ ఈ సారి మహేష్‌పై పడ్డాడు..!


వర్మ నైజమే విభిన్నం.. ఎందరు ఆయన్ను విమర్శిస్తున్నప్పటికీ, తన వ్యాఖ్యలతో ఎందరికో విరోధిగా మారుతున్నప్పటికీ ఆయన తనకు నచ్చిన, తాను నమ్మే సిద్దాంతాలను మాత్రం బహిరంగంగానే బయటపెడతారు. కాగా తాజాగా ఆయన టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌ను,ఆయన అభిమానులను టార్గెట్‌ చేశాడు. ఈ రోజున విశాఖ ఆర్కేబీచ్‌లో యువత చేపట్టాలని భావిస్తున్న ప్రత్యేకహోదా ఉద్యమానికి తన మద్దతు తెలిపాడు. అదే సమయంలో ఆయన పవన్‌ గురించి మాట్లాడుతూ, సాధారణంగా హీరోలు సినిమాలలో పోలీసులపై, రాజకీయనాయకులపై పోరాడుతుంటారు. కానీ పవన్‌ నిజజీవితంలో కూడా విలన్లుగా ప్రవర్తిస్తున్న పోలీసులు, పొలిటీషయన్స్‌పై పోరాటం చేస్తున్నాడు. 

Advertisement
CJ Advs

బ్రూస్‌లీ, సిల్వస్టర్‌ స్టాలోన్‌, అర్నాల్డ్‌ ష్వాగ్జనేగర్‌ వంటి స్టార్స్‌ కూడా చిన్న చిన్నపోరాటాలే చేశారని, కానీ పవన్‌ చేస్తున్నంతగా వారు కూడా పోరాటం చేయలేకపోయారని, పవన్‌ రియల్‌ హీరో అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. ఇక ఈ ఉద్యమానికి మహేష్‌ ఇప్పటివరకు మద్దతు తెలపకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. తనను ఇంతవాడిని చేసిన ప్రజలకు ఆయనిచ్చే గౌరవం ఇదేనా అంటూ మండిపడ్డాడు. ఇప్పటికైనా మహేష్‌ అభిమానులు తమ హీరోపై పవన్‌ ఇచ్చిన పిలుపుకు స్పందించేలా ఒత్తిడి తేవాలని లేని పక్షంలో వారు కూడా ద్రోహులుగా మిగిలిపోతారని వ్యాఖ్యానించాడు. ఇక మహేష్‌ ఇలాంటి రాజకీయ, వివాదాల జోలికి వెళ్లకపోవడం మంచిదని తాను వివాదాలకు దూరం అని అనుకుంటే మరి ఆయన తమిళనాడు యువత చేసిన జల్లికట్టు ఉద్యమానికి ఎలా మద్దతు పలికాడో? ఎందుకు మద్దతు పలికాడో కూడా తెలపాలని కోరారు. 

తమిళనాడుపై ఉన్న ప్రేమ మహేష్‌కు ఆంధ్రాపై లేదని ఎద్దేవా చేశారు. మరోపక్క నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో రాజమౌళి సహకారంకోరి, ఆయనకు మంచి పరపతి కల్పించాలని చంద్రబాబు గతంలో ఎత్తుగడ వేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ విషయంలో మాత్రం జక్కన్న మరోసారి తన నిజాయితీని నిరూపించుకున్నాడు. ఈ ఉద్యమానికి ఆయన మద్దతు పలికాడు. శాంతియుతంగా చేసే పోరాటాలకు తన మద్దతు ఉంటుందని పేర్కొన్నాడు. మొత్తానికి ఆంధ్రా యువత మౌన దీక్ష ద్వారా తెలపాలకున్న నిరసన ఉద్యమం సెగ ఇప్పుడే చల్లారదని చెప్పవచ్చు. పలు కారణాల వల్ల ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఆపినా, ప్రభుత్వం, పోలీసులు ఎల్లకాలం ఆపలేరని యువత అంటోంది.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs