Advertisement

2017 పద్మ అవార్డు గ్రహీతలు వీరే..!


ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. 2017వ సంవత్సరానికి గానూ ప్రకటించిన ఈ పద్మ అవార్డులు పలు రంగాల్లో విశేషమైన సేవలందించిన ప్రముఖులను వరించాయి. ఆయా రంగాల్లో ఉత్తమ సేవలు అందిస్తూ.. మెరుగైన ప్రతిభ కనబరచిన పౌరులకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారాలను ప్రకటించింది. ఇందులో భాగంగా పద్మ అవార్డు గ్రహీతల జాబితాను కూడా కేంద్రం విడుదల చేసింది. ఇందులో మొత్తం ఏడుగురికి పద్మవిభూషణ్, ఏడుగురికి పద్మభూషణ్, 75మందికి పద్మశ్రీ అవార్డులను పొందిన వారి పేర్లను ప్రకటించింది. 

Advertisement

కాగా ఈసారి తెలుగు రాష్ట్రాలకు చెందిన 8మందిని పద్మశ్రీ పురస్కారాలు వరించాయి. ఈ పద్మశ్రీ పురస్కారాలు వరించిన తెలుగు వారు ఎవరంటే.. డాక్టర్‌. ఎక్కె యాదగిరి రావు, త్రిపురనేని హనుమాన్‌ చౌదరి, డాక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ వహీద్‌, చంద్రకాంత్‌ పితవా, దరిపల్లి రామయ్య, మోహన్‌రెడ్డి, వెంకట్రామ బొడనపు, వి. కోటేశ్వరమ్మ, చింతకింది మల్లేశం. ముఖ్యంగా సంగీతంలో దిగంతాలకు తన కీర్తిని సొంతం చేసుకున్న సంగీతధీరుడు కె.జె. జేసుదాసుకు రెండో అత్యున్నత పౌర పురస్కారం లభించింది. కొన్ని దశాబ్దాలుగా తన విలక్షణమైన గానమాధుర్యంతో యావద్దేశాన్ని తన సంగీతంతో అలరిస్తున్న ప్రముఖ గాయకుడు కె.జె. జేసుదాస్‌కు పద్మ విభూషణ్ లభించింది. ఆయనతో పాటు దివంగత నేతలు సుందర్‌లాల్ పట్వా, పీఏ సంగ్మాలకు కూడా ఈ అవార్డును ప్రకటించారు. తాజాగా విడుదల చేసిన జాబితాలో సంఘసేవ చేస్తున్న వారికి, వివిధరంగాల్లో లబ్ధప్రతిష్ఠులైన వారికి కూడా ఈ అవార్డులు రావడం విశేషం. ఇంకా కలరియపట్టు లాంటి యుద్ధ విద్యను గత 68 సంవత్సరాలుగా ప్రాక్టీసు చేస్తున్న మీనాక్షి అమ్మ, ఎయిడ్స్‌పై పోరాటం చేసిన సునీతి సాల్మన్.. ఇలాంటి పలువురికి ఈసారి పద్మ అవార్డుల జాబితాలో చోటు దక్కడం ఎంతైనా జాతి గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ఇంకా వివిధ రంగాలలో ఎనలేని కృషి చేసిన వారిని పురస్కారం వరించడం ఎంతో విశేషంగా చెప్పవచ్చు. 

వారిలో..శ్రీ విశ్వ మోహన్ బట్ – ఆర్ట్ మ్యూజిక్ , రాజస్థాన్ కు చెందిన ప్రొఫెసర్ దేవీ ప్రసాద్ ద్వివేది – లిటరేచర్, ఉత్తర ప్రదేశ్ కు చెందిన శ్రీ తెహింటన్ ఉద్వాదియా – మెడిసిన్, మహారాష్ట్ర చెందిన శ్రీ రత్న సుందర్ మహరాజ్ – స్పిరిట్యువలిజం, గుజరాత్ కు చెందిన శ్వామి నిరంజన్ నంద సరస్వతి – యోగాలో,  బీహార్ కు చెందిన ప్రిన్సెస్ మహా చక్రి సిరిణ్ద్రోణ్ (విదేశీయులు) సాహిత్యం – థాయిలాండ్ లేటు శ్రీ చో రామస్వామి ఇలా పలువురికి ఆయా రంగాలలో విశేషంగా కృషి చేసిన వారికి పద్మ అవార్డులు వరించడం కృషికి వరించిన గౌరవంగా చెప్పవచ్చు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement