'జనతా గ్యారేజ్' సినిమా వచ్చి చాలా నెలలు గడుస్తున్నాయి. ఇప్పటివరకు ఎన్టీఆర్ తన కొత్త చిత్రాన్ని మొదలు పెట్టలేదు. చాలా గ్యాప్ తర్వాత డైరెక్టర్ బాబీ తో ఒక కొత్త చిత్రాన్ని మొదలు పెట్టబోతున్నాడు ఎన్టీఆర్. ఇక ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ నిర్మించనున్నాడు. అయితే ఎన్టీఆర్ ఈ కొత్త చిత్రంలో మూడు క్యారెక్టర్స్ లో కనిపిస్తాడని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే కళ్యాణ్ రామ్ ఒక టైటిల్ ని రిజిస్టర్ కూడా చేయించాడు. అయితే కళ్యాణ్ రామ్ రిజిస్టర్ చేయించిన 'జై... లవ.. కుశ' అనే టైటిల్ ఎన్టీఆర్ కొత్త చిత్రం కోసమే కళ్యాణ్ రామ్ రిజిస్టర్ చేయించాడని... ఎన్టీఆర్ చెయ్యబోయే మూడు క్యారెక్టర్స్ కి ఈ టైటిల్ లోని మూడు పేర్లు సెట్ అవుతున్నాయంటూ వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాయి.
అదలా ఉండగా మూడు క్యారెక్టర్స్ లో ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడని సమాచారం. ఇప్పటికే ఎన్టీఆర్ వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన 'అదుర్స్' చిత్రంలో రెండు విభిన్న పాత్రల్లో మెప్పించిన విషయం తెలిసిందే. అందులో ఒకటి కామెడీకి సంబందించిన పాత్ర కాగా మరొకటి యాక్షన్ కి సంబందించిన పాత్ర. ఇక ఈ రెండు పాత్రలను ఎన్టీఆర్ ఇరగదీశాడనే చెప్పాలి. ఇక ఇప్పుడు బాబీ డైరెక్షన్ లో వచ్చే సినిమాలో కూడా ఎన్టీఆర్ మూడు పాత్రలలో ఇరగదీయడం ఖాయమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ మూడు క్యారెక్టర్స్ ని బాబీ కొత్తగా డిజైన్ చేస్తున్నాడని చెబుతున్నారు. ఒక క్యారెక్టర్ ని కామెడీ క్యారెక్టర్ గా... రెండో క్యారెక్టర్ ని యాక్షన్ క్యారెక్టర్ గా ఇక మిగిలిన మూడో క్యారెక్టర్ ని కొత్తగా చూపించాలని కొత్తగా డిజైన్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.
అయితే ఆ మూడో క్యారెక్టర్ నెగెటివ్ షేడ్స్ లో ఉండబోతుందని టాక్. మరి కామెడీ, యాక్షన్, నెగెటివ్ రోల్ తో ఎన్టీఆర్ ఈ చిత్రంలో ఇరగదీస్తాడని అభిమానులు తెగ ఇదైపోతున్నారు. ఇక అభిమానులు పెట్టుకున్న అంచనాలకు అనుగుణంగానే డైరెక్టర్ బాబీ ఈ మూడు క్యారెక్టర్స్ ని రాసుకున్నాడని చెబుతున్నారు. ఏదైనా ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ని కూడా చేసి తనలో అన్ని కోణాలను చూపెట్టే అవకాశం ఈ చిత్రంతో వస్తుందనేది మాత్రం నిజం.