తనకు పాఠాలు సరిగ్గా చెప్పలేదని ఓ విద్యార్థి ఆరోపించాడు. అంతేకాదు సరిగా చెప్పనందుకు ఏకంగా ఆక్స్ ఫర్ట్ యూనివర్సిటీపైనే కేసు వేశాడు. అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇలాంటి తెలివితేటలు ఎవరికుంటాయి? కచ్చితంగా మనవాళ్ళకే ఉంటాయి. విషయానికి వస్తే ఆక్స్ ఫర్ట్ యూనివర్సిటీ అధ్యాపకులు తనకు సరిగా చదువు చెప్పలేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అందువల్ల చరిత్ర పాఠాలు తన బుర్రకు ఎక్కలేదని ఆరోపిస్తూ, యూనివర్సిటీపై కోర్టు కెక్కాడు. భారత సంతతికి చెందిన విద్యార్థి ఆరోపణలతో యూనివర్సిటీ కంగుతింది. ఎప్పుడో 2000వ సంవత్సరంలో చదివి, తీరిగ్గా ఇప్పుడు కేసు వేయడం సరికాదని వాదించింది. కోర్టు మాత్రం సమ్మతించలేదు. విచారణ చేస్తామని చెప్పింది. ఇది లండన్ లో జరిగింది. ఎంతైనా భారతీయల తెలివితేటల ముందు ఎవరైనా బలాదూర్.