'జల్లికట్టు' ఉద్యమ స్పూర్తి తమిళనాడు నుండి ఆంధ్రప్రదేశ్ కు అక్కడ నుండి కర్నాటకు పాకింది. కర్నాటకలో కూడా ఎద్దుల పందాలు ప్రసిద్ది. వీటిని 'కంబళ' అంటారు. సాంప్రదాయకంగా వస్తున్న ఈ గ్రామీణ క్రీడను 2014లో సుప్రీం కోర్టు నిషేధం విధించింది. జంతు హింస జరుగుతుందనేది వాదన.
'జల్లికట్టు'పై కూడా నిషేధం ఉన్నా తమిళనాడులో పెద్ద ఎత్తున ఉద్యమం సాగడంతో ఆటకు అనుమతి లభించింది. ఈ స్పూర్తితో ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా కోసం యువత నడుంబిగించిన విషయం తెలిసిందే. ఇదే స్పూర్తి కర్నాటకకు చేరింది. అక్కడి గ్రామీణ క్రీడ 'కంబళ'ను 2014లో సుప్రీంకోర్టు నిషేధించింది. ప్రతి ఏడాది నవంబర్ నుండి మార్చి వరకు 'కంబళి' క్రీడ సాగుతుంది. ఇవి ఎద్దుపందాలు. నాగలికి ఎద్దులను కట్టి, బురదలో పరుగెట్టిస్తారు. గెలుపు కోసం వేగంగా పరుగెత్తడానికి హింసిస్తారని అందువల్ల నిషేధం విధించాలనే జంతు ప్రేమికుల కోరిక ఫలిచింది. నిషేధం ఉన్నప్పటికీ కర్నాటకలోని కొన్ని ప్రాంతాల్లో అనధికారికంగా నిర్వహిస్తున్నారు. తాజాగా జల్లికట్టు ఉద్యమం ఫలించడంతో అదే స్పూర్తితో 'కంబళి'పై నిషేధం ఎత్తివేయాలనే ఉద్యమం కర్నాటకలో బీజం పడింది.
కర్నాటక యువత 'కంబళి' ఉద్యమాన్ని ఏ మేరకు తీవ్రరూపం చేసే యోచనతో ఉంది. అయితే తమిళనాడుకు ఇతర రాష్ట్రాల మధ్య కొంత తేడా ఉంది.'జల్లికట్టు'కు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. అందుకే అనుమతి సాధ్యమైంది.