ఒకప్పుడు యాంకర్ గా.... ఐటమ్స్ సాంగ్స్ లో కూడా ఆడిపాడిన ఉదయభాను అందరికి గుర్తుండే ఉంటుంది. ఉదయభాను గత కొద్దీ రోజులుగా ఎవరికీ కనబడకుండా తన భర్త తో అజ్ఞాతంలో గడుపుతుంది. అయితే ఆ మధ్యన తాను ప్రెగ్నెంట్ అని ఇంకొన్ని రోజుల్లో తనకి కవల పిల్లలు పుట్టబోతున్నారని... చెప్పి తాను తన భర్తతో కలిసున్న కొన్ని ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.... కొన్ని పత్రికలకు ఇంటర్వ్యూ లు కూడా ఇచ్చింది. తాను గత కొన్ని రోజులుగా తన ఫ్యామిలీకే టైమ్ కేటాయిస్తూ ఆనందాన్ని పొందుతున్నట్టు చెప్పుకొచ్చింది. ఇక ఆమె అలా చెప్పిందో లేదో ఉదయభానుకు కవల పిల్లలు పుట్టారని న్యూస్ వెలువడింది. ఉదయభాను గత ఆగష్టు లో ఇద్దరు కవల ఆడపిల్లలకి జన్మ నిచ్చినట్టు కొన్ని ఫొటోస్ ఉదయభాను పోస్ట్ చేసింది. మళ్ళీ అప్పటినుండి సైలెంట్ గా ఉన్న ఉదయభాను ఇన్నాళ్ళకి తన ఇద్దరి కూతుళ్ళ ఫొటోస్ ని మీడియాకి చూపించింది. ఆ ఫొటోస్ లో ఇద్దరు పిల్లలు చాలా క్యూట్ గా ఉన్నారు. ఇక ఉదయభాను తన ఇద్దరి పిల్లలకి యువి నక్షత్ర.. భూమి ఆరాధ్య.. అని పేర్లు కూడా పెట్టుకుంది. పిల్లల్లాగే పేర్లు కూడా చాలా బావున్నాయి కదా..!