Advertisement
Google Ads BL

వారి మీద వారు ఉమ్మేసుకున్నట్టే..!


'గౌతమీపుత్ర శాతకర్ణి' ఆడియో వేదికపై క్రిష్ 'ఖబడ్డార్' అన్న వ్యాఖ్యలకు నిరసనగా మెగాభిమానులు క్రిష్ ని చాలా దారుణంగా కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక క్రిష్ తర్వాత నేను చిరంజీవి గారిని, 'ఖైదీ నెంబర్ 150' చిత్రాన్ని ఉద్దేశించి అనలేదనే వివరణ ఇచ్చిన విషయమూ తెలిసిందే. అయితే అలా నందమూరి, మెగాభినులు చేసిన  కామెంట్స్ కి క్రిష్ ఇప్పటికి పలు టీవీ ఛానెల్స్ కి ఇచ్చిన ఇంటర్వూస్ లో స్పందిస్తూనే వున్నాడు. 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం హిట్ అవడంతో డైరెక్టర్ క్రిష్ పలు టీవీ ఛానెల్స్ కి తన ఇంటర్వ్యూ లు ఇస్తున్నాడు. అందులో భాగంగానే నేను ఎవరిని కించపరిచేలా మాట్లాడలేదని నిజమైన అభిమానులైతే అర్ధం చేసుకునే వారని తన మాటలను అంతలా వక్రీకరించేవారు కాదని చెప్పాడు.

Advertisement
CJ Advs

నేను మెగా హీరోలకు వ్యతిరేఖం కాదని నాకు బన్నీ, రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టక ముందే తెలుసనీ నేను చిరు గారికి పెద్ద ఫ్యాన్ అని... భవిష్యత్తులో చిరంజీవి గారిని డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే ఆయనతో  సినిమా చేస్తానని చెప్పాడు. ఇక బాలకృష్ణ విషయానికి వస్తే అయన నేను 'గౌతమీపుత్ర శాతకర్ణి' కథ చెప్పిన పది నిమిషాలకే ఓకె చేశారని... ఆయనకున్న కమిట్మెంట్ ముందు ఆయన్ని 'జై బాలయ్య' అని నినదించానని చెబుతున్నాడు. అలాగే ఆ రోజు 'గౌతమీపుత్ర...' ఆడియో రోజు నేను 'బహుపరాక్' అన్న పదాన్ని వాడాల్సింది..... కానీ పొరపాటున నోరు జారి 'ఖబడ్దార్' అన్నాను. నేను నా మొదటి సినిమా నుండి కేవలం 15  కోట్ల బడ్జెట్ తోనే సినిమా చేసాను. కానీ చారిత్రాత్మక కథ కావడం వల్ల  'గౌతమీపుత్ర శాతకర్ణి'కి 50  కోట్లు పైబడే పెట్టుబడి పెట్టాల్సి వచ్చిందని అన్నాడు. ఇక నేను వాడిన 'ఖబడ్దార్' అన్న పదంతో నన్ను విమర్శిస్తూ చేసిన ట్వీట్స్ చూసాక  నేను నాగబాబు గారికి, వినాయక్ గారికి ఫోన్ చేసి మాట్లాడాను. అసలు నా ఉద్దేశ్యం ఏమిటో వివరించాను. ఎటువంటు దురుద్దేశ్యంతో నేనా వ్యాఖ్యలు చెయ్యలేదని చెప్పాడు. 

అసలు చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి ఉన్న సాన్నిహిత్యం గురించి అభిమానులు అని చెప్పుకుంటున్న మీకెవరికైనా తెలుసా... నాకు తెలుసు అని నందమూరి అభిమానులకి, మెగా అభిమానులకి కలిపి క్లాస్ పీకాడు. చిరు, బాలయ్య 'గౌతమీపుత్ర శాతకర్ణి' హిట్ అవ్వాలని ఆకాంక్షిస్తే.... బాలయ్య, చిరు 'ఖైదీ నెంబర్ 150' హిట్ అవ్వాలని కోరుకున్నారు. నిజమైన మెగా అభిమానులైతే 'శాతకర్ణి' ప్లాప్ అవ్వాలనుకోరు. అలాగే నిజమైన నందమూరి అభిమానులైతే 'ఖైదీ...' చిత్రం పోవాలని కోరుకోరని డైరెక్ట్ గా అభిమానులని ఏకిపారేసాడు. అసలు బాలయ్యపై చిరు అభిమానులు, చిరంజీవిపై బాలయ్య అభిమానులు పలు అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు ఇలాంటి విమర్శలు చేయడానికి ఆ ఇద్దరి హీరోల వయసులో సగమైనా అర్హత ఉందా.... వారి అభిమానులకు. ఇలాంటి దారుణమైన... అసభ్యకరమైన కామెంట్ల వల్లే నేను ట్విట్టర్ ఓపెన్ చేయడానికి సిగ్గుపడుతున్నా.. అని చెప్పాడు క్రిష్. 

ఇక బాలకృష్ణ ఈ వయసులో గుర్రం పై ఎక్కి సవారి చేశారు. చిరంజీవిగారైతే ఈ వయసులోనూ డాన్స్ లు, ఫైట్స్ ఇరగదీసేస్తున్నారు. అంత గొప్ప వ్యక్తుల మీద కామెంట్ చేసే అర్హత నాకు లేదు. అసలు అభిమానులకు అంతకన్నా లేదు. ఇక చిరు, బాలయ్యల ముందు నేనెంత, మీరెంత. అసలు ఎవరైనా అలాంటి కామెంట్స్ చేస్తే వారి ఉమ్ము వారిమీద వేసుకున్నట్టే అని చాలా ఘటనైనా వ్యాఖ్యలతో మెగా, నందమూరి అభిమానులపై విరుచుకుపడ్డాడు క్రిష్. మరి క్రిష్ వ్యాఖ్యలకు అభిమానులమని చెప్పుకునే మెగా, నందమూరి అభిమానులు మారతారా? లేదా? అనేది కాలమే నిర్ణయిస్తుంది. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs