హాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు అక్కడి నుంచి కోలీవుడ్‌కు, టాలీవుడ్‌కు కూడా సిక్స్‌ప్యాక్ పిచ్చి బాగా వ్యాపించింది. యంగ్‌స్టార్స్ నుంచి చివరకు కమెడియన్స్ అయిన సునీల్, తాజాగా 50 ఏళ్లు దాటిన 30 ఇయర్స్ పృథ్వీకి కూడా ఇది అంటుకుంది. కాగా ఒక్కో ఏడాది ఒక్కో స్టార్ ఇలా సిక్స్‌ప్యాక్‌లతో కనిపిస్తూ ఆశ్చర్యం రేకెత్తిస్తున్నారు. ఇక మన టాలీవుడ్ సీనియర్‌స్టార్స్‌లో మొదటగా సిక్స్‌ప్యాక్ సాధించిన ఘనత కింగ్‌నాగార్జునకు దక్కుతుంది. ఆయన అప్పుడెప్పుడో వచ్చిన 'ఢమరుకం' చిత్రంలో సిక్స్‌ప్యాక్‌తో కనిపించాడు. ఆయన సిక్స్‌ప్యాక్ కోసం ఇతర యంగ్‌స్టార్స్‌లాగా తీవ్ర కసరత్తులయితే చేయలేదు. స్వతహాగా తన శరీరమే ఫోర్, సిక్స్‌ప్యాక్‌ను పోలి ఉంటుందని, దాంతో అతి తక్కువ సమయంలో, అతి తక్కువ కష్టంతోనే సిక్స్‌ప్యాక్‌సాధించానని ఆయన తెలిపాడు.
ఇక ఎప్పుడూ సిక్స్‌ప్యాక్ సాధించకపోయినా కూడా ఫిట్ గా ఉంటూ, కండలు తిరిగిన శరీరంతో వెంకీ కనిపిస్తుంటాడు. ఆయన పోలీస్ ఆఫీసర్‌గా నటించిన 'ఘర్షణ', తాజాగా బాక్సింగ్‌కోచ్‌గా 'గురు'లో ఆయన ఎంతో ఫిట్‌గా కనిపిస్తున్నాడు. కానీ ఈయనకు ప్రత్యేకంగా సిక్స్‌ప్యాక్‌పై ఇంట్రస్ట్ లేదు. ఇక 'ఖైదీ' తో రీఎంట్రీతో అదరగొడుతున్న మెగాస్టార్ చిరు మాట్లాడుతూ, 'ఖైదీ' చిత్రం కోసం 9కేజీలు తగ్గానని, కష్టపడితే సిక్స్‌ప్యాక్ పెద్ద కష్టం కాదని, డైరెక్టర్ కోరితే సిక్స్‌ప్యాక్ సాధిస్తానని తెలిపాడు. మరి ఆయన్ను సిక్స్‌ప్యాక్‌లో సురేందర్‌రెడ్డి చూపిస్తాడా? బోయపాటి శ్రీను చూపిస్తాడా? అనేది సస్పెన్స్‌గా ఉంది. మొత్తం మీద మెగాభిమానులకు మాత్రం చిరు తన సిక్స్‌ప్యాక్‌తో సర్‌ప్రైజ్ ఇవ్వడం గ్యారంటీ. ఈ వయసులో కూడా ఆయన సిక్స్‌ప్యాక్ అంటే ఆహా... ఓహో అనాల్సిందే. ఇక 'గౌతమీపుత్ర...'తో సెంచరీ పూర్తి చేసుకున్న బాలయ్య మాట్లాడుతూ, సిక్స్‌ప్యాక్‌లో తాను కనిపించలేనని, అది అసలు మన సంస్కృతే కాదంటూ కుండబద్దలు కొట్టాడు. మొత్తానికి సిక్స్‌ప్యాక్‌ల విషయంలో ఎవరి అభిరుచి వారిదని ఒప్పుకోవాలి...!