ఒక్కో ఏడాది ఒక్కో హీరోయిన్ హవా నడుస్తుంది. అనుష్క, ఆ తర్వాత కాజల్, సమంత, కిందటి ఏడాది రకుల్‌ప్రీత్‌సింగ్.. ఇలా ఒక్కో ఏడాది ఒక్కో హీరోయిన్‌కి కలిసి వస్తోంది. ముఖ్యంగా సమంత రేసు నుంచి తప్పుకున్న తరుణంలో గతేడాది 'నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ' వంటి చిత్రాలతో రకుల్ అదరగొట్టింది. దాంతో ఆమెకు ఈ ఏడాది కూడా తిరుగుండదని చాలా మంది భావించారు. కానీ కొత్త ఏడాదిలో ఆమెకు మహేష్-మురుగదాస్‌ల చిత్రం తప్పితే మరోస్టార్‌తో చిత్రం లేదు.
ఆమె కేవలం బెల్లకొండ శ్రీనివాస్, సాయిధరమ్‌తేజ్ వంటి అప్‌కమింగ్ హీరోలతో మాత్రమే నటిస్తోంది. గత ఏడాది 'నేను.. శైలజ'తో టాలీవుడ్‌కి పరిచయమై, కోలీవుడ్‌లో కూడా హవా చాటుతున్న కీర్తి సురేష్ ఆమె స్థానానికి ఎసరు పెట్టేలా కనిపిస్తోంది. ఆమె నాని సరసన నటించిన రెండో తెలుగు చిత్రం 'నేను.. లోకల్' ఫిబ్రవరి 3న విడుదల కానుంది. దీంతో పాటు ఆమెకు పవన్-త్రివిక్రమ్‌ల చిత్రంతో పాటు, మహేష్ -కొరటాల చిత్రాలలో కూడా అవకాశాలు ఎదురుచూస్తున్నాయి. మరోపక్క తన మొదటి మూడు చిత్రాలు 'అ...ఆ', 'ప్రేమమ్, 'శతమానం భవతి' చిత్రాలతో హ్యాట్రిక్ సాధించిన అనుపమ పరమేశ్వరన్‌తో పాటు అను ఎమ్మాన్యుయేల్‌కు కూడా స్టార్‌హీరోల చిత్రాలలో అవకాశాలు వస్తుండటంతో ఈ ఏడాది ఏ అమ్మడుకు ఎక్కువగా కలిసిరానుందనేది ఇప్పుడు టాలీవుడ్ ఫిల్మ్‌సర్కిల్స్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.