బుల్లితెర మీద గ్లామర్ షోతో అనసూయ, రష్మీ లు యాంకరింగ్ చేస్తూనే వెండితెర మీద అవకాశాలు పెట్టేస్తున్నారు. అయితే వీరిలాగే మరో యాంకర్ శ్రీముఖి కూడా వెండితెర మీద గట్టి ఛాన్స్ పట్టేయ్యాలని ఎదురు చూస్తుంది. ఇప్పటిదాకా కొని చిత్రాల్లో చిన్న పాత్రలు చేసిన శ్రీముఖి ఏదైనా ఒక చిత్రంలో హీరోయిన్ గా చెయ్యాలని తెగ ప్రయత్నాలు చేస్తుంది. ఇక శ్రీనివాస్ అవసరాల హంటర్ చిత్రంలో ఒక పాత్ర పోషిస్తున్నప్పటికీ అందులో కూడా మరో హీరోయిన్ తో స్క్రీన్ పంచుకోవాల్సి వచ్చింది.
అయితే ఇప్పుడు శ్రీముఖి కి హీరోయిన్ గా అవకాశం వచ్చిందనే ప్రచారం జరుగుతుంది. దర్శకుడిగా మారబోతున్న రైటర్ కమ్ నటుడు హర్షవర్ధన్ తాను తీసే మొదటి చిత్రంలో శ్రీముఖి కి హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడని చెబుతున్నారు. మంచి రైటర్ గా, ఒక మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న హర్షవర్ధన్ తెరకెక్కించబోయే కొత్త చిత్రంలో హీరోయిన్ గా శ్రీముఖి ఛాన్స్ కొట్టేసిందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఎలాగైనా దర్శకత్వ ఫీల్డ్ లోకి ఎంటర్ అవ్వాలనే కోరికతో హర్షవర్ధన్ ఒక డిఫరెంట్ కథని రెడీ చేసుకున్నాడని... ఇక ఈ చిత్రానికి టైటిల్ కూడా ఖరారైనట్లు వార్తలొస్తున్నాయి. ఆ చిత్ర టైటిల్ కొత్తగా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే టైటిల్‌ను హర్షవర్ధన్ తన సినిమా కోసం రిజిష్టర్ చేయించాడనే ప్రచారం జరుగుతోంది. మరి టైటిలే ఇంత వెరైటీగా ఉంటే ఇంకా సినిమా ఎంత వెరైటీ గా ఉంటుందో అని అందరూ అనుకుంటున్నారు.
మరి బుల్లితెర మీద రష్మీ, అనసూయలకి గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతున్న శ్రీముఖి ఇప్పుడు వారికి వెండితెర మీద కూడా పోటీ ఇవ్వడానికి సిద్ధమైందనే కామెంట్స్ వినబడుతున్నాయి. మరి ఈ చిత్రంతోనైనా శ్రీముఖి కల నెరవేరుతుందో? లేక మళ్ళీ వెండితెర అవకాశాల కోసం పడిగాపులు కాయాల్సి ఉంటుందో? చూద్దాం.