Advertisement

ఇద్దరు యంగ్‌హీరోల వీరోచిత యుద్దం..!


'బాహుబలి' ద్వారా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న యంగ్‌ స్టార్‌ రానా. ఆల్‌రెడీ రానా ఇప్పటికే కొన్ని హిందీ, తమిళ చిత్రాలలో కూడా నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన సంకల్ప్‌ అనే నూతన దర్శకునితో 'ఘాజీ' అనే చిత్రం చేస్తున్నాడు. ఇండో-పాక్‌ వార్‌ నేపథ్యంలో జరిగే సబ్‌మెరీన్‌ యుద్ద ఘటనల నేపథ్యంలో వాస్తవిక సంఘటనలతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో రానా నావికాదళ ఆఫీసర్‌గా కనిపించనుండగా, తాప్సి మరో కీలకపాత్రను చేస్తోంది. కాగా ఈ చిత్రం ఫిబ్రవరి17న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. బాలీవుడ్‌లో కరణ్‌జోహార్‌కు ఉన్న గుర్తింపు అందరికీ తెలిసిందే. 'బాహుబలి' చిత్రానికి బాలీవుడ్‌లో అంత క్రేజ్‌ రావడానికి ఆయన కూడా ఓ ప్రధాన కారణం. దాంతో 'ఘాజీ' చిత్రాన్ని కూడా బాలీవుడ్‌లో ఆయన చేతిలోనే పెట్టారు. విడుదలకు ఇంకా నెల సమయం ఉండగానే కరణ్‌జోహార్‌కి చెందిన 'ధర్మప్రొడక్షన్స్‌' సంస్థ ఈ చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమాలను ప్రారంభించి ప్రస్తుతం బాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ను సంపాదిస్తోంది. ఇక మరో తెలుగు యంగ్‌హీరో అల్లు శిరీష్‌ కూడా ఓ మలయాళ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం కూడా ఇండోపాక్‌ వార్‌ నేపథ్యంలో '1971' అనే టైటిల్‌తో రూపొందుతోంది. ఇందులో మోహన్‌లాల్‌ ప్రధానపాత్రను పోషిస్తుండగా, అల్లు శిరీష్‌ కూడా సైనికుడిగా కనిపించనున్నాడు. మొత్తానికి ఇప్పటి ట్రెండ్‌గా నడుస్తున్న వాస్తవిక గాథలకు సరిపోయే విధంగా ఈ ఇద్దరు యంగ్‌హీరోలు ఇండోపాక్‌ వార్‌లో భారత్‌ తరపున పోరాటం చేస్తుండటం ఆసక్తిని కలిగిస్తోంది. 

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement