'ఖైదీ నెంబర్ 150' సినిమా వంద కోట్లకు పైగా వసూలు చేసిందని అల్లు అరవింద్ గర్వంగా చెప్పారు. చిరంజీవిని ఘనంగా స్వాగతించారని కూడా అన్నారు. తమిళ 'కత్తి' సినిమా ఆధారంగా రీమేక్ చేసిన 'ఖైదీ నెంబర్ 150 ' కథలోనే దమ్ముంది. దానికి తమిళంలో విజయ్, తెలుగులో చిరంజీవి స్టార్ డమ్ తోడైంది.
'కత్తి' చిత్రం 12 రోజులకు వంద కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తం రన్ లో 120 కోట్ల గ్రాస్ రాబట్టింది. హీరో విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. (తమిళనాడులో 65, ఓవర్సీస్ 20, కర్నాటక, కేరళ, నార్త్ ఇండియా 15 కోట్లు వసూలు చేసింది)
విజయ్ తో పోలీస్తే చిరంజీవి మెగాస్టార్. ఆయన 'కత్తి' సినిమానే రీమేక్ చేశారు. బాక్సాఫీస్ లో ఈ రెండు చిత్రాలకు 100 కోట్ల గ్రాస్ రోజుల తేడాతో వచ్చాయి. అంటే స్టార్ డమ్ ప్లస్ కథాబలం కుదిరితే బాక్సాఫీస్ బద్దలు కొట్టవచ్చని స్పష్టమైంది. అంతేకానీ కేవలం చిరంజీవి పునస్వాగతం పేరుతో అభిమానులకు తప్పుడు సంకేతాలు పంపడం సరికాదని సినీ వర్గాలు అంటున్నాయి