Advertisement
Google Ads BL

టీజర్‌ను చూసి వావ్‌.. అంటున్నారు..!


ప్రతి సినిమాను తనదైన శైలిలో కొత్తగా ప్రజెంట్‌ చేయడంలో క్రియేటివ్‌ దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ది ప్రత్యేకశైలి. ఇక కమల్‌ తర్వాత ఆ స్థాయిలో ఏ పాత్రలోకైనా సరే పరకాయ ప్రవేశం చేసి జీవించే విలక్షణ హీరో విక్రమ్‌. ఈ ఇద్దరి అద్భుత కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'ధృవనక్షత్రం'. ఇందులో విక్రమ్‌కు జోడీగా అను ఎమ్మాన్యుయేల్‌ నటిస్తోంది. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభమైంది. కాగా గౌతమ్‌ ఎంతో కాలం ముందే ఈ సబ్జెక్ట్‌ను రెడీ చేసుకున్నాడు. మొదట సూర్యతో ఈ చిత్రం చేయాలని భావించాడు. కానీ ఆయనకు సూర్యకు మద్య వచ్చిన విబేదాల కారణంగా ఈ చిత్రం ఎందరో హీరోల చేతులు మారి చివరకు చియాన్‌ విక్రమ్‌ దగ్గరకు వచ్చింది. వాస్తవానికి విక్రమ్‌ తన 'ఇరుముగన్‌' చిత్రం తర్వాత దర్శకుడు విజయ్‌చందర్‌తో ఓ చిత్రం చేసి, ఆ తర్వాత హరి దర్శకత్వంలో 'సామి2' చేస్తాడని వార్తలు వచ్చాయి. కానీ 'సామి2' కంటే ముందే ఆయన దర్శకుడు గౌతమ్‌మీనన్‌ కథ వెరైటీగా అనిపించడంతో దానిని లైన్లోకి తెచ్చాడు. ఈ చిత్రంలో విక్రమ్‌ జాన్‌ అనే గూడచారి పాత్రను చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ ఎక్కువ భాగం విదేశాల్లో జరగనుంది. ఈ చిత్రం కంటే ముందే ఆయన విజయచందర్‌ దర్శకత్వంలో నటించిన చిత్రం విడుదల కానుంది. 'ధృవనక్షత్రం' సినిమాను గౌతమ్‌, విక్రమ్‌లు ఆగష్టులో స్వాతంత్య్రదినోత్సవ కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు. సాధారణంగా గౌతమ్‌తో పాటు విక్రమ్‌ చిత్రాలు కూడా చాలా ఆలస్యంగా తెరకెక్కుతూ, లేటుగా రిలీజ్‌ అవుతుంటాయి. కానీ ఈ చిత్రం విషయంలో మాత్రం అలాంటి పొరపాట్లు పునరావృతం కాకూడని ఇద్దరు కృతనిశ్చయంతో ఉన్నారు. స్పై థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రానికి హరీస్‌జైరాజ్‌ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ చిత్రం టీజర్‌ను తాజాగా చిత్ర యూనిట్‌ విడుదల చేసి అభిమానులతో ఆనందం పంచుకుంది. ఈ టీజర్‌ను చూసిన వారు ఇది హాలీవుడ్‌ చిత్రాల తరహాలో రూపొందుతోందని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చిత్రం అదే టైటిల్‌తో తెలుగులో కూడా ఒకేసారి విడుదల కానుందని సమాచారం. 

Advertisement
CJ Advs

title="Dhruva Natchathiram - Official Teaser | Chiyaan Vikram | Gautham Vasudev Menon" dir="ltr">Dhruva Natchathiram - Official Teaser 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs