దేశీయంగా కంటే ఓవర్సీస్ లో ఎక్కువ కలెక్షన్లు వస్తేనే మన స్టార్ హీరోలు ఖుషీ అవుతున్నారు. విదేశీ మార్కెట్ లో సైతం సత్తా చాటితేనే స్టార్ డమ్ ఉన్నట్టు చిత్ర సంబంధికులు ప్రచారం చేసుకుంటున్నారు. ఓవర్సీస్ లో వన్ మిలియన్ కలెక్షన్లు సాధిస్తే హిట్ సినిమాగా భావిస్తున్నారు. ఈ విషయంపై 'ఖైదీ నంబర్ 150', 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమాల నడుమ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మాకు ఎక్కువ వచ్చాయంటే మాకని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. నిజానికి ఇలాంటి లెక్కల్లో విశ్వసనీయత తక్కువ. అధికారికంగా కలక్షన్లను ప్రకటించాల్సిన బయ్యర్లు మాత్రం నోరు విప్పరు. అయిప్పటికీ ఎవరికివారే విులియన్ మార్క్ దాటేశామని చెప్పుకుంటున్నారు.
సోమవారం ఒక దిన పత్రిక దీనికి సంబంధించి డెస్క్ కథనం ప్రచురించింది. ఆ ప్రకారం చూసుకుంటే 'బాహుబలి' 7 మిలియన్ల డాలర్లు సాధించి తొలి స్థానంలో నిలిచింది. చిరంజీవి, బాలకృష్ణ తాజా సినిమాలు వన్ మిలియన్లు డాలర్లు, 'ధృవ', 'ఊపిరి', 'అ ఆ', 'ఈగ', 'భలే భలే మగాడివోయి', 'పెళ్లి చూపులు' వంటి చిత్రాలు మిలియన్ డాలర్లు వసూలు చేశాయట. మహేష్ బాబు, పవన్ కల్యాణ్ నటించిన సినిమాలు కూడా ఈ మైలురాయిని ఎప్పుడో దాటేశారు. విక్టరీ వెంకటేశ్ మాత్రం ఈ లిస్ట్ లో లేడు.
ఈ కథనం ప్రకారం విదేశాల్లో మిలియన్ డాలర్లు సాధించడం అనేది సర్వసాదారణంగా మారింది. కాబట్టి ఈ క్రెడిట్ మా హీరోకే దక్కిందని అభిమానులు హడావుడి పడడం అనవసరం.