సంప్రదాయానికి విలువ ఇవ్వాలని, శతాబ్దాల క్రీడకు తమిళ హీరోలు మద్దతు ప్రకటించారు. ఎద్దును మచ్చికచేసుకునే, లొంగదీసుకునే జల్లికట్టుకు సుప్రీంకోర్టు చెక్ పెట్టింది. జంతు ప్రేమికుల ఆందోళన అర్థం చేసుకుంటూ, ఈ క్రీడలో పశువులకు గాయాలవుతాయని భావించి క్రీడను నిషేధించింది. కోర్డు ఉత్తర్వులున్నప్పటికీ తమిళ స్టార్లు కమల్ హాసన్, రజనీకాంత్, విజయ్, శింబు వంటి వారు బాహాటకంగా జల్లికట్టుకు మద్దుతు తెలిపారు. దాంతో కనుమ రోజున జరిగే ఈ క్రీడకు తమిళనాడులో మద్దతు లభించింది.
ఇలాంటి కోర్టు ఉత్తర్వులు తెలుగునాట జరిగే కోళ్ళ పందాలపై ఉన్నాయి. పక్షి ప్రేమికుల అభ్యంతరాలపై స్పందిస్తూ కోర్టు ఈ పందాలని నిషేధించింది. ఇది కూడా సంప్రదాయ ఆటనే. శతాబ్దాలుగా ఉంది. నాటి బొబ్బిలి యుద్ధం కోళ్ళ పందాల కారణంగానే జరిగింది. అయితే తెలుగు వారి సంప్రదాయాన్ని గుర్తించి మన హీరోలెవరూ అనుకూలంగా మాట్లాడలేకపోయారు. అది తమకు సంబంధం లేదనే విషయంగా భావించారు. ఈ క్రీడ ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రమే ఎక్కువ జరుగుతుంది. కోట్ల రూపాయలు చేతులు మారతాయి. కోర్టు ఆదేశాలున్నప్పటికీ కోళ్ళ పందాలు మాత్రం ఆగలేదనేది వేరే విషయం.
తమిళ హీరోలకు, తెలుగు హీరోలకు ఉన్న తేడా అర్థమైందనుకుంటా.