గతంలో రావుగోపాలరావు, సత్యనారాయణ వంటి నటులు విలన్ పాత్రలే కాదు.. కామెడీ పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లుగా కూడా నవసరాలు పండించేవారు. ఇక తెలుగు కమెడియన్ అల్లు రామలింగయ్య, తమిళ కమెడియన్ నగేష్ సైతం విలన్‌గా అదరగొట్టిన చిత్రాలున్నాయి. ఇక నిన్నటి వారిలో ఆ క్రెడిట్, స్టామినా కోట, రఘువరన్, తనికెళ్లభరణి వంటి వారు అందిపుచ్చుకున్నారు. ఆ తర్వాత పరాయిభాషా నటుడైనప్పటికీ ప్రకాష్‌రాజ్ కూడా అన్ని పాత్రల్లో నటించి చిరకాలం గుర్తుండిపోయే చిత్రాలు చేస్తున్నాడు. ఇక నేడు రావురమేష్‌తో పాటు సీనియర్‌హీరోలైన జగపతిబాబు, సుమన్ వంటి వారు కూడా అన్నిరకాల పాత్రను చేసి మెప్పిస్తున్నారు. అయితే విలన్ అంటే కేవలం ఆరడుగుల ఆజానుబాహుడై, కండలు పెంచి కనిపించాలనే ఆలోచనను నుంచి ఇంకా కొందరు మన దర్శనిర్మాతలు హీరోలు బయటకురాన్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి చిరు 150వ చిత్రమైన 'ఖైదీ'లో చిరు స్థాయికి తగ్గ ప్రతినాయకుడు లేకపోవడం పెద్ద మైనస్ అయిందనేది వాస్తవం. ప్రతినాయకుడు ఎంత పవర్‌ఫుల్‌గా నటిస్తే, ఆ చిత్ర నాయకుడికి మరింత బలం వస్తుంది. ఈ విషయం 'బాహుబలి'లో రానా చేసి చూపించాడు. కానీ 'ఖైదీ'లో కార్పొరేట్ విలన్‌గా స్టైలిష్‌గా కనిపించిన తరుణ్‌అరోరా ఉసూరుమనిపించాడు. కానీ ప్రస్తుతం పవన్ నటిస్తున్న 'కాటమరాయుడు' చిత్రంలో కూడా రావు రమేష్‌తో కలిసి ఈ తరుణ్ అరోరానే మరో విలన్‌గా నటిస్తున్నాడు. తాజాగా ఆయన బోయపాటి శ్రీను వంటి మాస్, మసాలా డైరెక్టర్ బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా చేస్తున్న చిత్రంలో కూడా విలన్‌గా ఫైనల్ అయ్యాడట. ఇవ్వన్నీ చూస్తుంటే మన మేకర్స్ మైండ్‌సెట్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా పూర్తిగా మారలేదని స్పష్టమవుతోంది.