శాతకర్ణి సినిమా ప్రమోషన్ లో శ్రియ కనిపిస్తోంది. ఖైదీ.. ప్రచారంలో మాత్రం కాజల్ అడ్రస్ లేదు. ఈ తేడా ఎందుకు? ఏరి కోరి ఎంచుకున్న నాయికలను ఖైదీ యూనిట్ పక్కన పెట్టేసిందా? లేక ఆమె అందుబాటులో లేదా? అనే అనుమానం కలుగుతోంది. ఖైదీ.. సినిమాలో నటించే నాయిక కోసం ఎలాంటి అన్వేషణ జరిగిందో తెలుసు. నయనతార, అనుష్క వంటి వారి పేర్లు తొలుత వినిపించాయి. చివరికి ఫ్యాన్సీ ఆఫర్ తో కాజల్ ను ఒప్పించారు. సినిమాలో కాజల్ కు ఉన్న పాత్రపరిధి తక్కువే. పాటల్లో మాత్రం మెరిసింది. టాలీవుడ్ లో అగ్రస్థానంలో ఉన్న నాయికల్లో కాజల్ ఒకరు. అందుకే ఆమె స్టారడమ్ చూసే తీసుకున్నారు.
మరి ఖైదీ.. ప్రమోషన్ లో మాత్రం పక్కన పెట్టేశారు. కేవలం సక్సెస్ క్రెడిట్ చిరంజీవికి మాత్రమే దక్కాలని, మరెవరూ పొందకూడదనేది యూనిట్ అభిప్రాయంలా కనిపిస్తోంది. ప్రత్యేకంగా ప్లాన్ చేసి చిత్రీకరించిన ప్రమోషన్ ఇంటర్య్వూల్లో కూడా ఇదే జరిగింది. జరిగిన, జరుగుతున్న విషయాలు గ్రహించి కాజల్ తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆమె మేనేజర్ ఖైదీ యూనిట్ తో సంప్రదించినప్పటికీ, అనుకూల స్పందన రాలేదట. చిరంజీవి కాంబినేషన్ లో నటించాక, తనకు మరిన్ని ఆఫర్స్ వస్తాయని భావించిన కాజల్ ఈ పరిణామం నిరాశకలిగించిందట.