Advertisement
Google Ads BL

'ఖైదీ..' కి కావాల్సినంత ప్రమోషన్...!


మెగాస్టార్‌ 150వ చిత్రం 'ఖైదీ నెంబర్‌ 150' చిత్రం కలెక్షన్లపరంగా దమ్మురేపుతోంది. ప్రేక్షకులకు ఈ చిత్రం ఓ మంచి విందుభోజనంగా మారింది. పండగ సంబరాలను రెట్టింపు చేసింది అనేది వాస్తవం. కాగా ఈ చిత్రాన్ని నిర్మాత, చిరు తనయుడు రామ్‌చరణ్‌ తొలిసారిగా తమ 'కొణిదెల' బేనర్‌లో నిర్మించడం కూడా చాలా ఆసక్తిని కలిగించింది. కాగా ఇప్పుడు ఈ సినిమాకు ఎంత బడ్జెట్‌ పెట్టారు? అనే విషయంపై ట్రేడ్‌వర్గాల్లో ఆసక్తికరచర్చ సాగుతోంది. కాగా ఈ చిత్రాన్ని చిరు రెమ్యూనరేషన్‌ కాకుండా ఇతర నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఇచ్చిన పారితోషికాలతో పాటు మొత్తం బడ్జెట్‌ 40కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు. మరి ఇప్పటికే కలెక్షన్లలో దుమ్మురేపుతోన్న ఈ చిత్రం లాంగ్‌రన్‌తో పాటు మొత్తం ఎంత కలెక్ట్‌ చేస్తుంది? అనే దానిపై ఇప్పుడే ఓ నిర్ణయానికి రాలేమని, కానీ మొత్తం మీద ఈ చిత్రం చరణ్‌కు నిర్మాతగా మొదటి చిత్రానికే భారీ లాభాలను అందించడం ఖాయమంటున్నారు. 

Advertisement
CJ Advs

ఇక ఈ చిత్రాన్ని తాజాగా చిరు సోదరుడు పవన్‌కళ్యాణ్‌ తన స్నేహితుడు శరత్‌మరార్‌తో పాటు వీక్షించాడట. అభిమానులలాగానే ఆయన కూడా తన అన్నయ్యలో ఇప్పటికీ తగ్గని గ్రేస్‌, ఎనర్జీలెవల్స్‌, ఆయన చిత్రంలో నవరసాలను పోషించిన తీరును చూసి మంత్రముగ్దుడయ్యారని సమాచారం. 

ఇక తన ట్వీట్స్‌తో అందరినీ ఆకర్షిస్తోన్న మంచు లక్ష్మీ ఈ చిరు 150వ చిత్రం గురించి ట్వీట్‌ చేస్తూ.. చిరు 'చింపిఫైడ్‌' చూశాను. వాట్‌ ఎ మెసేజ్‌... వాటే కమర్షియల్‌ ఎలిమెంట్స్‌. ప్రొడ్యూసర్‌గా చరణ్‌ మేమంతా గర్వపడేలా చిత్రాన్ని నిర్మించారని సంతోషం వ్యక్తం చేసింది. ఇక ఆమె వాడిన 'చింపిఫైడ్‌'కు ఆంగ్లంలో అర్థలేకపోయనా 'చించేశాడు' అనే పదానికి ఆమె తన ఆంగ్లంను జోడించి 'చింపిఫైడ్‌'గా మార్చిందని అంటున్నారు. 

ఇక ఈ చిత్రం కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు... ఓవర్‌సీస్‌తో పాటు బెంగుళూరుతో పాటు కర్ణాటకలోని ఇతర ప్రాంతాలలో కూడా రికార్డు కలెక్షన్లు సాధిస్తోంది. ఈ చిత్రం విడుదల సందర్భంగా కర్ణాటక స్టేట్‌ రామ్‌చరణ్‌ యువసేన రాష్ట్ర అధ్యక్షుడైన మార్టిన్‌ తన సొంత డబ్బులు ఐదులక్షలకు పైగా ఖర్చుపెట్టి చిరు, చరణ్‌ల కటౌట్ల్‌ ఏర్పాటు చేసి, వాటిని గజమాలలు వేసి, సినిమా చూడటానికి వచ్చిన అభిమానులకు స్వీట్స్‌ పంచి పెట్టి సందడి చేయడం ఇప్పుటికీ కర్ణాటకలో ఉన్న చిరు ఇమేజ్‌కు ఇది అద్దం పడుతోందని అంటున్నారు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs