Advertisement
Google Ads BL

క్రిష్‌ ఆవేదన.. అభిమానులు అర్థం చేసుకోవాలి!


ఇప్పుడు సోషల్‌మీడియాలో మొదటగా కులం ప్రస్తావన ఎక్కువగా వస్తోంది. ఏదో చదువురాని నిరక్షరాస్యులు మాత్రమే కులం కుమ్ములాటల్లో ఉంటారని ఆమద్య వరకు కొందరు మేథావులు అభిప్రాయపడేవారు. కానీ సోషల్‌మీడియాను చూసే వారంటే వారు ఖచ్చితంగా మంచి విద్యను అభ్యసించేవుంటారు. కానీ వారు కూడా కులాల పేరుతో అసభ్యంగా కామెంట్లు చేసుకుంటున్నారు. బాలయ్య మంచి పని చేశాడు.. అని గర్వంగా ఉంది అంటే అలా అన్నవాడు కూడా అదే కులానికి చెందినవాడని లేదా చిరు బాగా చేశాడు అంటే అలా అన్నందుకు వారిని చిరు కులం వాడంటూ తిట్టిపోస్తున్నారు. నాగరిక సమాజంలో ఇప్పటికీ ఈ స్థాయిలో కుల పిచ్చి ఉందని చాలా మందికి సోషల్‌మీడియా విస్తృతం అయిన తర్వాత గానీ అర్ధం కాలేదు. 

Advertisement
CJ Advs

తాజాగా 'గౌతమీపుత్ర...' దర్శకుడు క్రిష్‌ ఈ విషయంపై తన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన తన గురువైన తమ్మారెడ్డిభరద్వాజకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా స్పందించాడు,... నేను చిరు ఫ్యామిలీని ఉద్దేశించి ఖబడ్డార్‌ అని అనలేదని, అలా వివరణ ఇచ్చిన తర్వాత కూడా తనపై తిట్ల దండకం ఆపకపోవడం సమంజసం కాదన్నారు. నేను చిరు గారికి చాలా అభిమానిని, నన్ను నమ్మి అల్లుఅర్జున్‌ 'వేదం'లో డబ్బులు కూడా పెట్టి నటించారు. వరుణ్‌తేజ్‌ను 'కంచె' తీశాను. చరణ్‌ నాకు చాలా మిత్రుడు. అలా మెగాఫ్యామిలీని అవమానించేంత కుసంస్కారం నాకు లేదు. ఇప్పటికీ ఉత్తరాది వారు మనలను మద్రాసీలనే అంటారు. తెలుగు వీరుడైన శాతకర్ణి ద్వారా తెలుగు వారు గర్వించేలా చిత్రం తీయాలని భావించాను. ఆ ఆడియో వేడుకలో నేను 'బహుపరాక్‌' అనబోయి 'ఖబద్దార్‌' అన్నాను. ఆ తర్వాత ఇది వివాదంగా మారడంతో నేను చాలా భయపడ్డాను. నాగబాబు గారికి ఫోన్‌ చేసి ఈ విషయం చెప్పాను. రాఘవేంద్రరావు అంకుల్‌కి కూడా చెప్పాను. నాకు ఇప్పుడు ట్విట్టర్‌ ఓపెన్‌ చేయాలంటేనే సిగ్గేస్తోంది... చిరాకేస్తోంది. సోషల్‌మీడియాలో కులాల పేరుతో అగ్లీ వార్‌ జరుగుతుండటం ఆవేదనను కలిగిస్తోంది.ఈ ఇద్దరు లెజెండ్స్‌ను ఎవరైనా విమర్శిస్తే, అది ఆకాశంపైకి ఉమ్మేయడమే అవుతుంది, ఆ ఉమ్మి మరలా వారి మీదే పడుతుంది. దయచేసి కులాల ప్రస్తావన తేవద్దు. 'కంచె' వంటి చిత్రం తీసిన నేను కులాలను పట్టించుకోను... అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశాడు దిగ్రేట్‌ క్రిష్‌. మరి ఇకనైనా అందరిలో కులాల, మతాల ప్రస్తావన తగ్గే రోజు వస్తుందనే ఆశతో జీవించాల్సిరావడం బాధాకరం. అన్నివర్గాల ప్రేక్షకులు,అన్ని మతాల వారు, కులాల వారు చూస్తేనే కదా సినిమా హిట్టయ్యేది. అంతేగానీ ఒకే కులం వారు చూస్తే ఆ చిత్రం పెద్ద హిట్‌ అవుతుందా? అనేది ఆలోచించాల్సిన విషయం. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs