చిరు సినిమాకు 47.7 కోట్లు మొదటి రోజు వచ్చాయని, బావ అల్లు అరవింద్ వెల్లడించాడు. ఆయనను సినిమా మేకింగ్ లో పక్కకి తోసేశారు. కొణిదెల ప్రొడక్షన్ లో బావకు ఎలాంటి పాత్ర లేదు. అయినప్పటికీ అనధికార హోదాతో కలక్షన్లు లెక్కలు మీడియాకు చెప్పారు. అదే రోజు బాలకృష్ణ శాతకర్ణి విడుదలై, హిట్ టాక్ తెచ్చుకున్నాక, ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయిందని స్పష్టమయ్యాక అల్లు గారు సర్దుకున్నారు. శాతకర్ణి కలక్షన్ల రిపోర్ట్ రాకముందే ఖైదీ సినిమా గురించి చెప్పాలని హడావుడి పడ్డారు. ఖైదీ కోసం ఎక్కువ థియేటర్లు బ్లాక్ చేసిన సంగతి మరిచారు. అప్పోజిషన్ సినిమాకు పరిమిత సంఖ్యలో థియేటర్లు లభ్యమయ్యేలా బయ్యర్లతో చేతులు కలిపిన విషయం బహిరంగమే. ఈ కారణంగానే ఓపనింగ్ కలక్షన్లు బాగా వచ్చాయనే విషయాన్ని మరిచారు. చిరంజీవికి ఆదరణ ఏ మాత్రం తగ్గలేదని చెప్పడమే ఆయన లక్షంగా కనిపిస్తోంది.
చిరంజీవి ఇమేజ్ ను కాపాడడమే అల్లువారి ఉద్దేశం. నిజానికి తొలి రోజు 47 కోట్లు ఏ విధంగా వచ్చాయి, కేవలం హౌస్ ఫుల్స్ కారణంగానే వచ్చాయా లేక కొన్ని థియేటర్లలో శ్లాబ్ రేట్ నిర్ణయించి టికెట్లు అమ్మారా? ఈ విషయాన్ని ఆయన దాటేశారు. తొలి రోజు వచ్చిన కలక్షన్లు రెండవ రోజు కూడా వచ్చాయా? ఆ లెక్కలు కూడా చెబుతారా అనేది చూడాలి. పనిలో పనిగా చిరంజీవి రెండవ సినిమాకు కర్ఛీప్ వేసుకున్నారు. చిరంజీవి స్టార్ డమ్ కేవలం తమ కుటుంబానికి మాత్రమే పరిమితమని, తామే క్యాష్ చేసుకుంటామని అల్లుగారు చెప్పినట్టే అని అర్థం చేసుకోవాలి.