క్రియేటివిటి పేరుతో మూడున్నర ఏళ్ళు బాహుబలి తీసిన రాజమౌళికి దర్శకుడు క్రిష్ పెద్ద సవాల్ విసిరారు. శాతవాహనుల చరిత్రనే ఎనిమిది నెలల్లో తెరకెక్కించి ఆశ్చర్యపరిచారు. చారిత్రాత్మక చిత్రాన్ని కూడా పరిమిత బడ్జెట్ తో తీయవచ్చని నిరూపించారు. మరి రాజమౌళి చేస్తున్నదేమిటీ, కల్పిత కథను తీరిగ్గా తీస్తున్నారు.గ్రాఫిక్స్ అంటూ,. సాగదీశారు. ఆర్టిస్టుల డేట్స్ సంవత్సారల కొద్ది తీసుకున్నారు. బడ్జెట్ లెక్కలు భారీగా చెప్పారు. గౌతమిపుత్ర శాతకర్ణి చూశాక రాజమౌళి చెప్పింది నిజమేనా, లేక కేవలం మార్కెటింగ్ కోసం సాగదీశారా అనే అనుమానం సినీ వర్గాల్లో కలుగుతోంది. దర్శకుడిగా తన ఇమేజ్ ను వ్యాపారంగా మార్చుకోవడం కోసమే ఈ ఎత్తుగడ వేశారా? అనే సందేహిస్తున్నారు.
శాతకర్ణి సినిమా వీక్షించిన ప్రేక్షకులు బాహుబలితో పోల్చుకున్న మాట వాస్తవం. బాహుబలిలో గ్రాఫిక్ మాయాజాలం సగటు ప్రేక్షకుడిని కట్టిపడేసింది. శాతకర్ణితో ఆనందంతో పాటుగా,. చరిత్రను కళ్ళకుగట్టినట్టుగా చూపింఛారని సంతృప్తి చెందుతాడు. ఈ తేడాను రాజమౌళి గమనిస్తే మంచిది. కేవలం గ్రాఫిక్స్ తో మెస్మరైజ్ చేస్తూ, కల్పిత కథకు తెరరూపం ఇచ్చారు. ఆయన కూడా నిజాయితీగా అంగీకరిస్తారు.