Advertisement
Google Ads BL

పాములను పెంచుకుంటున్న హీరో..!


'నువ్వే కావాలి' చిత్రంలోని 'అనగనగా ఆకాశం ఉంది...' ఫేమ్‌ సాయికిరణ్‌ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఆయన పలు చిత్రాలలో నటించాడు. అందం, అభినయంతో పాటు స్వతహాగా సింగర్‌ కూడా అయిన ఆయనకు మన పరిశ్రమలో మంచి బ్రేక్‌ లభించలేదు. దాంతో ఆయన త్వరగా తెరమరుగైపోయాడు. కాగా ఈయనకు పాములు పట్టడంలో మంచి ప్రావీణ్యం, శివభక్తుడు కావడంతో పాములపై ఎంతో ప్రేమ కూడా ఉన్నాది. పలు చోట్ల, చిన్నతనంలో తన ఇంటిలో వారు కూడా తాచుపామును చంపడంతో ఆయన ఎంతో బాధపడ్డానంటున్నాడు అందుకే సైనిక్‌పురిలోని పాముల సంరక్షణ కేంద్రంలో వాటిని పట్టడంలో తర్ఫీదు కూడా పొంది, ఇప్పటివరకు దాదాపు 3వేల పాములను పట్టి సంరక్షించాడంట. వీటిలో తనను అవి కరిచిన సందర్భాలు ఉన్నాయని, మరీ ముఖ్యంగా ఓ విషపాము మాత్రమే ఇప్పటి వరకు తనను కాటేసిందని చెప్పుకొచ్చాడు. అలాగే తాను చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌, నాగార్జున వంటి స్టార్స్‌ ఇళ్లలో కూడా పాములు పట్టానని, అన్నపూర్ణ స్టూడియోస్‌లో రెండు విషసర్పాలను కూడా పట్టినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఆయన అభిరుచిని, వ్యాపకాన్ని మాత్రం అభినందించకతప్పదు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs