మలయాళంలో వచ్చి ఘనవిజయం సాధించిన 'ప్రేమమ్'.. ఆ చిత్రంలో నటించిన వారందరికీ మంచి మంచి కెరీర్స్‌ను అందించింది. అందులో అనుపమ పరమేశ్వరన్ కూడా ఉంది. ఆమె తెలుగులో నటించిన 'ప్రేమమ్' రీమేక్‌తో పాటు, త్రివిక్రమ్-నితిన్‌ల 'అ...ఆ' చిత్రం కూడా ఆమెకు టాలీవుడ్‌లో మంచి మంచి అవకాశాలను సాధించి పెడుతున్నాయి. ఆమె పూర్తిస్థాయి హీరోయిన్‌గా యంగ్ హీరో శర్వానంద్ సరసన నటించిన 'శతమానం భవతి' పై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంది. మంచి నిర్మాతగా పేరున్న దిల్‌రాజు బేనర్‌లో ఆమెకు లభించిన ఈ అవకాశాన్ని ఆమె ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి..! ఈ చిత్రం 14వ తేదీన విడుదలకు సిద్దమవుతోంది. ఇక ఆమె ఈచిత్రంలో చూపించిన నటనకు ముగ్థుడైన నిర్మాత దిల్‌రాజు తన తదుపరి చిత్రంలో కూడా ఆమెకే అవకాశం ఇచ్చాడని సమాచారం.
త్వరలో ఆయన నేచురల్ స్టార్ నాని హీరోగా వేణు శ్రీరాం దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించనున్నాడు. ఇందులో నాని సరసన ఈ 'ప్రేమమ్' బ్యూటీనే చాన్స్ దక్కించుకుందని తెలుస్తోంది. ఇక ఆమెకు రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందబోయే చిత్రంలో ఓ గ్రామీణ అమ్మాయిగా నటించనుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మొదట ఈ పాత్రకు రాశిఖన్నాను అనుకున్నప్పటికీ తర్వాత అనుపమను ఫైనల్ చేశారట. అలాగే ఎన్టీఆర్-బాబిల చిత్రంలో కూడా ఆమె పేరును పరిశీలిస్తున్నారు. మరి ఈ చిత్రంలో ఆమె మెయిన్ హీరోయినా? లేక సెకండ్ హీరోయినా? అన్నది సస్పెన్స్‌గానే ఉంది. మొత్తానికి ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్నవన్నీ మంచి చిత్రాలే కావడంతో ఆమెకు ఈ చిత్రాల ద్వారా పెద్ద బ్రేక్ రావడం ఖాయం అంటున్నారు.