ఇటీవల తాను మొదటి సారిగా సంక్రాంతి పండుగకు 'హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య'గా వస్తున్నానని, కానీ ఈ పోటీలో తనకు ఒక్క థియేటర్ కూడా దొరకడం లేదని, తనకు ప్రతిసెంటర్‌లోనూ కనీసం ఒక్కధియేటర్‌ని ఇవ్వమని పీపుల్స్‌స్టార్ ఆర్.నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ వ్యాఖ్యలను ఎవ్వరూ పట్టించకోకపోయినా దిగ్రేట్ రామోజీరావు మాత్రం స్పందించాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, లేవలేని స్థితిలో ఉన్న మీడియా మొఘల్‌కి ఈ విషయం తెలిసింది. దీంతో ఆయన తన సిబ్బందిని హుఠాహుటిన పిలిచి, తనకు, తన మయూరి డిస్ట్రిబ్యూషన్స్‌కు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న పలుకుబడిని ఉపయోగించి, కనీసం ఓ 100 థియేటర్లను ఆర్.నారాయణమూర్తికి ఇవ్వాలని ఆదేశించడంతో ఆయన సినిమాకు థియేటర్లు లభించాయి. వాస్తవానికి కనీసం ద్విచక్రవాహనం కూడా పీపుల్స్‌స్టార్‌కి లేదు. కేవలం భుజానికి సంచీ తగిలించుకుని, మాసిపోయిన తెల్ల గుడ్డలతో ఆయన సర్వీస్ ఆటోలలో లేదా నడిచే వెళ్తాడే గానీ కనీసం కారులో ఎవరైనా లిఫ్ట్ ఇస్తామన్నా కూడా ఎక్కడు.ఇలా ఆయన తన వ్యక్తిత్వంతో ప్రసాద్‌ల్యాబ్స్ అధినేతతోపాటు, దాసరి వంటి పలువురితో మంచి సఖ్యత ఉంది. ఇక స్వర్గీయ శ్రీహరి ఆయనకు చిత్రాల విషయంలో, ఆర్ధికంగా ఎంతో సహాయం చేసేవాడు. ఈ విషయం టాలీవుడ్‌లోని అందరికీ తెలుసు. మొత్తానికి ఇప్పుడు రామోజీ అండ కూడా తనకు లభించడంతో ఎంతో ఆనందంతో రామోజీకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాడు.