తెలుగు సినిమాలకు ఎక్కువ ఆదాయం లభించే ఏరియా నైజాం. కాగా నైజాంలో దాదాపు అన్ని థియటర్లు అల్లు అరవింద్, దిల్‌రాజు, సురేష్‌బాబుల వద్దే ఉన్నాయి. కాగా సంక్రాంతి కానుకగా చిరు నటించిన 'ఖైదీనెంబర్150', బాలయ్య 'గౌతమీపుత్ర శాతకర్ణి', దిల్‌రాజు 'శతమానం భవతి' చిత్రాలు విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రాలను ముగ్గురు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తాజా సమాచారం ప్రకారం చిరు 'ఖైదీ....' చిత్రం వెనుక అల్లు, ఏసియన్‌ఫిల్మ్స్‌ల సహకారం తీసుకొంటున్నారు. బాలయ్య 'గౌతమీ...' చిత్రం వెనక సురేష్‌బాబు అండగా ఉన్నాడు .
ఇక దిల్‌రాజు గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. ఈ ముగ్గురు తమ తమ చిత్రాలను సాధ్యమైనని ఎక్కువ థియేటర్లలో విడుదల చేయాలని భావిస్తున్నారు. కానీ చిత్రాలు విడుదలైన ఫస్ట్ వీకెండ్ పూర్తికాగానే, ఆయా చిత్రాలకు వచ్చే టాక్, రెస్పాన్స్, కలెక్షన్లను బట్టి ఆ తర్వాత ఏ సినిమాకి థియేటర్లు పెంచాలి? ఏ చిత్రాలకు థియేటర్లు తగ్గించాలి.. అనే నిర్ణయానికి వచ్చేలా ఈ ముగ్గురు నిర్మాతలు చీకటి ఒప్పందం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. సరే.. ఈ నిర్ణయం మంచిదే. ఎందుకంటే ఈ నిర్ణయం వల్ల ముగ్గురు నిర్మాతలు లాభపడతారు. కానీ ఇదే పండగకి వస్తోన్న పీపుల్స్‌స్టార్ ఆర్.నారాయణమూర్తి నటిస్తున్న 'హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య' సినిమా గురించి ఎవ్వరు పట్టించుకోకపోవడం బాధాకరం.