Advertisement
Google Ads BL

స్టార్స్ ఆవేదన బాధ కలిగిస్తోంది..!


ఒకేసారి రెండు స్టార్స్‌ చిత్రాలు క్లాష్‌ అవ్వడం ఈ మధ్య కామన్‌గా జరుగుతోంది. ఫ్యాన్స్‌ ఒత్తిడి వల్ల, ఇగో ప్రాబ్లమ్స్‌ వల్ల ఇలాంటివి జరుగుతుంటాయి. కానీ ఈ విషయాలలో కొందరు తగ్గుతారు.. ఇగోలను పక్కనపెడతారు. 'బాహుబలి1' విషయంలో మహేష్‌ 'శ్రీమంతుడు', రాబోయే 'బాహుబలి2' విషయంలో కూడా మహేష్‌ మురుగదాస్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం రిలీజ్‌ విషయంలో కూడా మహేష్‌ మంచి నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కానీ ప్రస్తుతం రాబోయే సంక్రాంతికి మాత్రం రెండు మూడురోజుల్లో పెద్దగ్యాప్‌ లేకుండా చిరు 'ఖైదీ నెంబర్‌ 150', బాలయ్య 'గౌతమీపుత్ర శాతకర్ణి'లు విడుదల అవుతున్నాయి. అదే తరహాలో మరో 15రోజుల్లో బాలీవుడ్‌లో కూడా ఒకేరోజున భారీ బాక్సాఫీస్‌ యుద్దం జరగనుంది. కింగ్‌ఖాన్‌ షారుఖ్‌ నటించిన 'రాయిస్‌', గ్రీకు వీరుడు హృతిక్‌రోషన్‌ నటిస్తున్న 'కాబిల్‌' చిత్రాలు ఒకేరోజున అంటే జనవరి25నే విడుదల కానున్నాయి. 

Advertisement
CJ Advs

కాగా ఈ విషయంలో షారుక్‌ది, ఆయన అభిమానులదే తప్పు అనిపిస్తోంది. ఈ రెండు చిత్రాల అర్థాలు కూడా ఒకే విధంగా ఉండటం మరింత ఆసక్తికరంగా మారింది. 'కాబిల్‌' అంటే సమర్థత. 'రాయిస్‌' అంటే ప్రసిద్దత. ఇక ఈ రెండు చిత్రాలు ఆయా హీరోల సొంత చిత్రాలు కావడం మరో ఆసక్తికర అంశం. హృతిక్‌ నటిస్తోన్న 'కాబిల్‌' చిత్రాన్ని ఆయన తండ్రి రాకేష్‌రోషన్‌ నిర్మిస్తున్నాడు. ఇక షారుఖ్‌ నటిస్తున్న 'రాయిస్‌' చిత్రాన్ని షారుఖ్‌ భార్య గౌరీ నిర్మిస్తోంది. కాగా మొదట హృతిక్‌ చిత్రాన్ని జనవరి 26న విడుదల చేస్తామని ప్రకటించారున. కానీ అదే తేదీని షారుఖ్‌ తన 'రాయిస్‌'కు ప్రకటించాడు. దీంతో రాకేష్‌ తమ 'కాబిల్‌'ను ఒకరోజు ముందుగా అంటే జనవరి25కి మార్చాడు. వెంటనే ఫారుక్‌ కూడా తన చిత్రాన్ని అదేరోజుకు మార్చాడు. దీంతో పోటీ తప్పని పరిస్థితి ఏర్పడింది. కాగా షారుఖ్‌ ఫ్యాన్స్‌ తమ హీరో చిత్రమైన 'రాయిస్‌' ముందు హృతిక్‌ 'కాబిల్‌' నిలబడలేదని, 'మొహంజదారో'లాగా కొట్టుకుపోతుందని హేళన చేయడం ప్రారంభించారు. 

దాంతో కాస్త ఇగోకి పోయిన రాకేష్‌రోషన్‌ అదే తేదీన తన కుమారుడైన హృతిక్‌ చిత్రాన్ని ఫిక్స్‌ చేశాడు. దీంతో వీరిద్దరి పోరు అనివార్యమైంది. కానీ ఈ విషయంపై ఇప్పటివరకు హృతిక్‌ స్పందించలేదు. తాజాగా మాత్రం ఆయన తన మనసులోని ఆవేదనను బయటికి వెళ్లడించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెండు పెద్ద చిత్రాలు ఒకేసారి విడుదలకావడం చట్ట వ్యతిరేకం కాదు.. కానీ అనైతికం. హాలీవుడ్‌లో ఇలాంటి అనైతిక పరిస్థితి లేదు. కనీసం మా చిత్రాలను చూసి భావితరాల హీరోలకు కనువిప్పు కావాలి. షారుఖ్‌ గారు కూడా తన చిత్రాన్ని చాలా బాగా తీసివుంటారని భావిస్తున్నాను. పాపం.. వారికి మరో విడుదల తేదీ దొరక్కపోయివుండవచ్చు. ఈ విషయంలో నేను ఆయన్ని తప్పుపట్టను. కానీ ఈ పోటీ వల్ల ఇద్దరికీ వందల కోట్ల నష్టవస్తుందనేది వాస్తవం. ఈ రెండు చిత్రాలు విజయవంతం కావాలని, ఇద్దరి అభిమానులు సంతోషంగా ఉండాలని, ఇద్దరి కుటుంబాలలో ఆనందం పొందాలని కోరుకుంటున్నాను. దీని గురించి ఇక ఎక్కువగా ఆలోచించడం వృథా. నా చేతిలో లేని విషయాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు.కానీ ఇది కేవలం సినిమా, బిజినెస్‌లకు మాత్రమే పరిమితం. షారుఖ్‌గారితో నాకున్న స్నేహానికి ఇది అడ్డురాదు,.. అంటూ తన ఆవేదనను వెల్లడించాడు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs