ఆ నటీమణి వైకాపాలోకి వెళ్తుందా..!


హాట్ ఆంటీగా టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హేమ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సినిమాల్లో మంచి ఇమేజ్ ఉన్న హేమా ప్రజల్లో కూడా ప్రత్యక్షంగా అదే ఇమేజ్ తో దూసుకుపోవాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. కాగా హేమా ఆంటీ గతంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి అప్పటికప్పుడు స్థాపించిన జై సమైఖ్యాంధ్ర పార్టీ తరఫున తూర్పు గోదావరి జిల్లా మండపేట నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నిల్లో కనీసం డిపాజిట్ కూడా హేమా దక్కించుకోని విషయం తెలిసిందే. అప్పటికప్పుడు స్థాపించి ఎవరూ ఊహించని విధంగా  కొత్తపార్టీ కావడంతో అలా జరిగింది గానీ, లేకపోతే హేమా ఏంటి గెలవకపోవడం ఏంటి అంటూ అప్పట్లో ఆమె రాజకీయాలకు సంబంధించిన విషయాలపై విశ్లేషణలు కూడా వెల్లడైనాయి. అందులో ఆ ప్రాంతమంతా అప్పుడు పవన్, తెదేపా హవా నడవడంతో అలా జరిగిందని కూడా తెలుస్తుంది. దాంతో హేమా రాజకీయాలకు తాత్కాలికంగా పక్కనబెట్టి తిరిగి సినిమాల్లో బిజీ అయిపోయింది.

కాగా తాజాగా హేమా ఆంటీ వైకాలోకి ఎంట్రీ ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. హేమ తాజాగా ఈ మధ్య కాపులకు రిజర్వేషన్ల విషయంపై తెదేపాపై విమర్శలు గుప్పించింది. దీంతో సహజంగా ఏదో ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలని హేమా సంకల్పంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం కాపు రిజర్వేషన్లంటూ వైకాపాలో చేరి అలా ప్రజల మనస్సులను గెలవాలని హేమా చూస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే వైకాపాకు కూడా ఇటువంటి గ్లామర్ నాయికలు అవసరం ఎంతైనా ఉంది. చూద్దాం హేమా ఆంటీ నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో. 

Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES