పవన్ కళ్యాణ్ తన అన్న తొమ్మిదేళ్ల తర్వాత నటిస్తున్న 'ఖైదీ నెంబర్ 150' ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి హాజరు కావడంలేదని అర్ధమైపోతుంది. ఈ మధ్యన సోషల్ మీడియాలో పవన్ అసలు ఖైదీ.... ఫంక్షన్ కి హాజరవుతాడా? లేక అన్నకి హ్యాండ్ ఇస్తాడా? అని ఒకటే వార్తలు ప్రచురితమవుతున్నాయి. కానీ రామ్ చరణేమో పిలిచాం రావడం రాకపోవడం ఆయనిష్టం.... ఆయనేం చిన్నపిల్లాడు కాదు అని ఘాటుగా స్పందిస్తూనే బాబాయ్ రాక కోసం వేయికళ్లతో టెంక్షన్ గా ఎదురు చూస్తున్నాడు. మరో పక్క మెగా ఫ్యాన్స్ ని పవన్ రాకపోతే ఎలా కంట్రోల్ చేయాలో తెలియక మెగా హీరోలందరూ తలలు పట్టుకున్నారు. ఇదంతా ఇంత రసవత్తరంగా సాగుతున్న టైమ్ లో పవన్ ఒక పక్క రాజకీయాల్లో, మరోపక్క 'కాటమరాయుడు' షూటింగ్ లో బిజీ బిజీ గా గడుపుతున్నాడు.
ఇక ఇప్పుడు పవన్ తాజాగా తన అన్న చిరంజీవి నటిస్తున్న 'ఖైదీ నెంబర్ 150' గురించి ట్విట్టర్ లో స్పందించాడు. 'చరణ్, మా వదిన సురేఖ గారి నిర్మాణంలో వస్తున్నా తోలి చిత్రమే చిరంజీవిగారి 150వ చిత్రం కావడం నాకు చాల ఆనందంగా వుంది. 'ఖైదీ నెంబర్ 150' చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నాను. ఇక ఈ చిత్రం లో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణలకు నా మనః పూర్వక శుభాకాంక్షలు' అంటూ ట్వీట్ చేసాడు. అంటే పవన్ ఇలా ఇప్పుడే ట్విట్టర్ లో తన అభిప్రాయాన్ని తెలిపేసి ఇక ఫంక్షన్ కి వచ్చి అన్నయ్యకి విషెస్ చెప్పేదేముందనేగా దానర్ధం.
అయితే పవన్ ఈ ఫంక్షన్ కి రాకపోవచ్చని.... హైదరాబాద్ లోని గోల్కొండ పరిసరప్రాంతాల్లో జరిగే 'కాటమరాయుడు' షూటింగ్ లో బిజీగా పవన్ వున్నాడని... అందుకే ఖైదీ... ఫంక్షన్ కి పవన్ రాకపోవచ్చని పవన్ సన్నిహితులు చెబుతున్నారు. ఏది ఎలాగున్నా పవన్ ఈ 'ఖైదీ నెంబర్ 150' ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి హ్యాండ్ ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనేది వాస్తవం. ఇక పవన్ ట్వీట్ కూడా ఇందుకు నిజమనే సంకేతాలు ఇస్తుంది.