Advertisement
Google Ads BL

ఓకే...వాళ్ళ టార్గెట్‌ మణిరత్నమే..!

maniratnam,ok jaanu movie,karan johar,ok bangaram,shaad ali,south cinema industry | ఓకే...వాళ్ళ టార్గెట్‌ మణిరత్నమే..!

బాలీవుడ్‌ సినిమాలలో ఈమద్య పచ్చి బూతు, శృంగార సన్నివేశాలు, లిప్‌లాక్‌లు కామనైపోయాయి. ముఖ్యంగా 'హంటర్‌'తో పాటు తాజాగా వచ్చిన 'బేఫికర్‌' చిత్రాలు బ్లూఫిల్మ్స్‌ను మరిపించాయి. కానీ ఈ చిత్రాల విషయంలో పెద్దగా స్పందించని బాలీవుడ్‌ మీడియా తాజాగా మణిరత్నం సినిమాను మాత్రం తీవ్రంగా విమర్శిస్తూ, మణిపై మండిపడుతున్నారు. పోనీ ఇది మణి దర్శకత్వం వహించిన చిత్రమా.. అంటే కాదు. తమిళ, తెలుగులో భాషల్లో తాను నిత్యామీనన్‌, దుల్కర్‌ సల్మాన్‌లతో సహజీవనం అంశంపై తీసిన 'ఓకే కన్మణి' (ఓకే బంగారం)కు రీమేక్‌గా మణిరత్నం, కరణ్‌జోహార్‌తో కలిసి నిర్మిస్తున్న 'ఓకే జాను' చిత్రంపైనే ఈ విమర్శలన్నీ. ఈ చిత్రానికి మణి శిష్యుడు షాద్‌అలీ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం ఈనెల 13న రిలీజ్‌కు సిద్దమవుతోంది. ఇందులో కొన్ని లిప్‌లాక్‌ సీన్స్‌తో పాటు శృతిమించిన శృంగార సన్నివేశాలు కూడా ఉన్నాయి. విడుదలైన ఈ చిత్రం ట్రైలర్స్‌ను చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. తమిళ, తెలుగు భాషల్లో ఏ మాత్రం అసభ్యతకు తావులేని విధంగా అద్భుతంగా తెరకెక్కించిన మణి.. హిందీలో మాత్రం ఈ చిత్రానికి కేవలం నిర్మాత మాత్రమే. బాలీవుడ్‌ ట్రెండ్‌కు అనుగుణంగా అలాంటి సీన్స్‌ను తాను చేయలేనని భావించే మణి ఈ చిత్రం దర్శకత్వ బాధ్యతలను షాద్‌అలీకి అప్పగించాడు. కాగా ఈ చిత్రంలోని ఇలాంటి శృతిమించిన సన్నివేశాలన్నీ కథలో మిళితమై ఉండటంతో సెన్సార్‌బోర్డు కూడా ఈ చిత్రానికి కేవలం నాలుగు డైలాగ్స్‌ను మ్యూట్‌ చేసి, యు/ఎ సర్టిఫికేట్‌ను ఇచ్చింది. దీనిపై కూడా బాలీవుడ్‌ మీడియా రచ్చ.. రచ్చ చేస్తోంది. 

Advertisement
CJ Advs

ఇందులో ఆదిత్యారాయ్‌కపూర్‌తో పాటు శ్రద్దాకపూర్‌ కూడా రొమాంటిక్‌ సీన్స్‌లో రెచ్చిపోయారు. వీరిద్దరి కెమిస్ట్రీ అదిరిపోయింది. ఇలాంటి రొమాంటిక్‌సీన్స్‌ వల్లనే తమ చిత్రానికి యువత నుంచి మంచి క్రేజ్‌ వస్తుందని భావిస్తున్నారు. ఈ చిత్రంలో రెహ్మాన్‌ రీమిక్స్‌ చేసిన 'హమ్మా..హమ్మా..' సాంగ్‌ అదరగొడుతోంది. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ను చూసి పలువురు ప్రశంసలు కురిపించారు. ఇతర చిత్రాలపై సాధారణంగా మౌనంగా ఉండే టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు కూడా ఈ చిత్రం ట్రైలర్‌ చూసి ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ట్రైలర్‌ ఎంతో కనువిందుగా ఉందని, ముఖ్యంగా రవి.కె.చంద్రన్‌ సినిమాటోగ్రఫీ అదిరిపోయిందని తెలిపాడు. సరే.. మరి ఈ చిత్రంపై బాలీవుడ్‌ మీడియా చెత్త చెత్త కామెంట్స్‌ చేస్తూ, మణిరత్నంను బాధ్యుడుని చేస్తూ రచ్చ రచ్చ చేయడం చూస్తుంటే... వారు కేవలం నిర్మాత అయిన మణిని తిడుతున్నారే గానీ.....ఈచిత్రానికి నిర్మాణభాగస్వామిగా వ్యవహించిన మరో బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌జోహార్‌ను, దర్శకుడు షాద్‌అలీని, ఇందులో నటించిన శ్రద్దాకపూర్‌, ఆదిత్యారాయ్‌కపూర్‌లను మాత్రం విమర్శించపోవడం దారుణమని, బాలీవుడ్‌ మీడియాకు దక్షిణాది చిత్రాలన్నా, ఇక్కడి హీరోలు, దర్శకులు, నిర్మాతలన్నా పడదని, ఇలాంటి విమర్శల ద్వారా వారు మరోసారి ఉత్తరాది అహంకారాన్ని చూపిస్తున్నారని కోలీవుడ్‌ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs