Advertisement
Google Ads BL

సంచలనం సృష్టిస్తోన్న 'ఖైదీ..' ఇన్‌సైడ్‌ టాక్‌!


ప్రతి సినిమా, మరీ ముఖ్యంగా స్టార్‌హీరోల చిత్రాలు సెన్సార్‌ అయిన తర్వాత, ఎడిటింగ్‌ జరిగేటప్పుడు ఆ సినిమా ఇన్‌సైడ్‌ టాక్‌లు బయటకు రావడం సాధారణమే. చిత్రాల విడుదలకు ముందే ఆయా చిత్రాల సీన్స్‌ కూడా ఇంటర్నెట్‌లో లీక్‌ కావడం చూస్తే.. ఇన్‌సైడ్‌టాక్‌ బయలుదేరడం పెద్ద విశేషమేమీ కాదు... గతంలో పలు చిత్రాల విషయంలో ఇలా ఇండస్ట్రీలో ఇన్‌సైడ్‌ టాక్‌గా వచ్చిన పలుఅంశాలు నిజమేనని తేల్చాయి. కాగా 'ఖైదీ..' ఇన్‌సైడ్‌ టాక్‌ అంటూ ఇండస్ట్రీలో పలువురు చర్చించుకోవడం హాట్‌టాపిక్‌గా మారింది. పరిశ్రమ అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం గురించి వచ్చిన వార్తలు ఏమిటంటే... ఈ చిత్రంలో చిరు అభినయం, ఆయన డ్యాన్స్‌లు, మూడు పాటల చిత్రీకరణ బాగుందంటున్నారు. ఇక ఇంటర్వెల్‌బ్యాంగ్‌, ప్రీ క్లైమాక్స్‌కు ముందు వచ్చే రైతుల సమస్యలపై చిరు చెప్పే డైలాగులు, రాజకీయపరమైన సంభాషణలు, చిరు ఎంట్రీ సీన్‌, యాక్షన్‌ సీన్స్‌ బాగా ఉన్నాయని తెలుస్తోంది. కానీ ఈ చిత్రం క్లైమాక్స్‌ మాత్రం చాలా వీక్‌ అంటున్నారు. ఈ చిత్రాన్ని తనకున్న అనుభవంతో చిరునే పక్కనుండి ఎడిటింగ్‌ విషయాలు చూసుకుంటున్నాడట. చిరు జడ్జిమెంట్‌పరంగా పర్‌ఫెక్ట్‌ పర్సన్‌ కాబట్టి ఆ విషయాన్ని దర్శకనిర్మాతలు చిరు చేతిలోనే పెట్టారని సమాచారం. 

Advertisement
CJ Advs

ఇక ఈ చిత్రంలో బ్రహ్మనందం, థర్టీ ఇయర్స్‌ పృథ్వీ, పోసాని కృష్ణమురళి వంటి వారు నటిస్తున్నారు. ఈమధ్య ప్రతి చిత్రంలోనూ దుమ్మురేపుతోన్న పృథ్వీ నటించిన కామెడీ ట్రాక్‌ అద్భుతంగా ఉన్నప్పటికీ ఈ ట్రాక్‌ సినిమా ఫ్లోకు ఆటంకంగా ఉందని భావించిన చిరు వాటిని డిలేట్‌ చేసి, కత్తెర వేసాడంటున్నారు. మరోపక్క ఫామ్‌లో లేని బ్రహ్మానందం ఈ చిత్రంలో మరోసారి 'బకరా' పాత్రను పోషించాడట. ఆయనపై కామెడీ పండనప్పటికీ బ్రహ్మితో చిరుకు ఉన్న సెంటిమెంట్‌ దృష్యా వాటిని మాత్రం అలాగే ఉన్నట్లు ఉంచారంటున్నారు. ఇక పోసాని పేల్చే పంచ్‌ డైలాగులు బాగా ఉన్నాయట. మొత్తానికి ఓ వర్గం మాత్రం అవుట్‌పుట్‌ అదిరిందని, కేవలం చిరు కోసమైనా ఈ చిత్రాన్ని అందరూ చూసేలా ఆయన మేకోవర్‌, డ్యాన్స్‌లు, ఫైట్స్‌, డైలాగులతో పాటు 'ఇంద్ర' నాటి చిరు గుర్తుకు వస్తున్నాడంటుండగా, మరో వర్గం మాత్రం.. అబ్బే.. సినిమా బాగాలేదు. ఈచిత్రం అవుట్‌పుట్‌ పట్ల చిరు సంతృప్తిగా లేడనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయాలు నిజమేనా? కాదా? తెలియాలంటే ఈనెల 11 వరకు వెయిట్‌ చేయాలి. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs