Advertisement
Google Ads BL

'ఠాగూర్‌' నేను సైతం కు.. ఖైదీ 'రైతు' పోటీ!


మురుగదాస్‌ తమిళంలో తెరకెక్కించిన 'రమణ' రీమేక్‌గా చిరు, వినాయక్‌ల కాంబినేషన్‌లో వచ్చిన 'ఠాగూర్‌' చిత్రం అవినీతిపై పోరాటంగా, మంచి సందేశాత్మక చిత్రంగా రూపొంది, ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో మహాకవి శ్రీశ్రీ రచించిన 'నేను సైతం...'ను స్ఫూర్తిగా తీసుకుని, సుద్దాల అశోక్‌తేజ రచించిన ధీమ్‌ సాంగ్‌ విశేష ఆదరణ పొందడమే కాదు.. ఏకంగా జాతీయ అవార్డును గెలుపొందింది. తాజాగా అదే మురుగదాస్‌ చిత్రమైన 'కత్తి'కి రీమేక్‌గా చిరు నటిస్తున్న 'ఖెదీ నెంబర్‌ 150' చిత్రం రూపొంతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రైతుల కష్టాలు, కడగండ్లపై మంచిసందేశాన్ని ఇస్తూ రూపొందింది. తాజాగా ఈ చిత్రంలో రైతులకష్టాలను తెలిపే థీమ్‌సాంగ్‌ అయిన 'నీరు.. నీరు.. రైతు కంట కన్నీరు' పాట విడుదలై మంచి స్పందనను రాబడుతోంది. ఈ పాట 'ఠాగూర్‌'లోని 'నేను.. సైతం' పాటకు ధీటుగా ఉందనే చెప్పాలి. నాడు సుద్దాల రాసిన సాహిత్యానికి ఏమాత్రం తగ్గకుండా ఈ పాటను రామజోగయ్య శాస్త్రి అద్భుతంగా, సూటిగా, రైతుల సమస్యలను తెలిపేలా వాడిన సాహిత్యం, దేవిశ్రీ ఇచ్చిన గంభీరమైన ట్యూన్‌, శంకర్‌మహదేవన్‌ గానం అన్ని వింటే ఈ చిత్రంలో ఈ పాట కూడా 'నేను...సైతం'ని మరిపించేలా ఉందని అంటున్నారు. ఇక 'ఠాగూర్‌'తో పాటు తాజాగా 'కత్తి'కి సైతం ఎంతో మంచి కథను అందించిన దర్శకుడు మురుగదాస్‌కు నిర్మాత చరణ్‌ కృతజ్ఞతలు తెలిపాడు. ఈ చిత్రం కూడా 'ఠాగూర్‌'ని మించిన స్థాయిలో విజయవంతం అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs