గత రెండు రోజులుగా ఎక్కడ చూసిన 'ఖైదీ....' కి సంబందించిన వార్తలే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మొన్నటిదాకా ఆడియో ఫంక్షన్ గురించి మాట్లాడుకున్న జనాలు నిన్నటి నుండి ప్రీ రిలీస్ ఫంక్షన్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక ఆ సమస్య కూడా సద్దుమణగి ఇప్పుడు పవన్ కళ్యాణ్ 'ఖైదీ...' ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వస్తాడా? రాడా? అని అందరూ ఇప్పడు చర్చించుకుంటున్నారు. ఇదంతా ఇలా ఉండగా 'ఖైదీ నెంబర్ 150' లో నటించిన ఒక కమెడియన్ మాత్రం చాలా బాధపడుతున్నాడు. కారణం అతనితో తీసిన సీన్స్ అన్నీ తొలగించడం.
ఆ కమెడియన్ ఎవరో కాదు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి. అసలు పృథ్వి కి 'ఖైదీ....' లో వచ్చిన ఛాన్స్ కి ఎగిరి గంతేశాడంట. అంతే ఉత్సాహం తో చిరుతోపాటే షూటింగ్ లో పాల్గొన్న పృథ్వి ఇప్పుడు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నాడు. ఈ మధ్యన టాలీవుడ్ టాప్ కమెడియన్స్ అందరిని పక్కకి నెట్టి మరీ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న పృథ్వికి ఇది పెద్ద షాక్. ఇక పృథ్వి నటించిన 18 సన్నివేశాలను ఎడిటింగ్ లో తొలగించినట్లు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ప్రచురితమవడంతో పృథ్వి ఈ వార్తలపై స్పందించాడు. 'మెగాస్టార్ గారి 150వ సినిమాలో నటించడంనా అదృష్టం అని..... నేను నటించిన సీన్స్ తొలగించడం నా దురదృష్టం అని.. .. సంక్రాంతి రోజున మా మదర్ చనిపోయినంత బాధగా వుంది' అని ట్వీట్ ద్వారా తన ఆవేదన వ్యక్తం చేసాడు.
అయితే మెగా స్టార్ చిరంజీవి డాన్సులను, ఫైట్స్ ని బాగా ఎలివేట్ చేయడానికి, బ్రహ్మానందం నటించిన కొన్ని సీన్స్ ని ఎలివేట్ చెయ్యడానికే పృథ్వి సన్నివేశాలు తొలగించినట్లు సమాచారం. మరసలు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజమేనా? నిజంగా పృథ్వి సన్నివేశాలను తొలగించారా? అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న