సూపర్‌స్టార్ మహేష్‌బాబు, దర్శకుడు మురుగదాస్‌ల కాంబినేషన్‌లో తెలుగు, తమిళ భాషల్లో దాదాపు 100కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రాన్ని ఈ ఏడాది విడుదల కానున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీగా చెప్పుకోవచ్చు. కాగా ఈ చిత్రానికి 'వాస్కోడిగామా, ఎనిమీ, ఏజెంటు శివ, ఏజెంట్ 007, అభిమన్యు' వంటి పలు టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. ఈ చిత్రానికి ఎట్టకేలకు 'సంభవామి' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారని, ఫిల్మ్ ఛాంబర్‌లో కూడా ఈ టైటిల్‌ను రిజిష్టర్ చేయించారని వార్తలు వచ్చినా దీనిపై కూడా అధికారిక ప్రకటన లేదు. ఈ చిత్రం టైటిల్‌ను జనవరి1న విడుదల చేస్తామని ప్రకటించిన యూనిట్ ఆ తేదీన టైటిల్‌ను అనౌన్స్ చేయకపోవడంతో మహేష్ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే తాజాగా దర్శకుడు మురుగదాస్ ఈ చిత్ర యూనిట్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన ట్వీట్‌లో 'బ్లాక్‌బస్టర్ ఆన్ ది వే' అని రాయడంతో మహేష్ అభిమానులు సంబరపడుతున్నారు. చిత్రం టైటిల్, ఫస్ట్‌లుక్‌లు ఎప్పుడు విడుదలవుతాయా? అని కోటికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం సమ్మర్ రేసులో రిలీజ్ కానుంది. మొత్తానికి ప్రస్తుతానికి దర్శకుడి ట్వీట్‌తో మురిసిపోతున్న ప్రిన్స్ ఫ్యాన్స్‌కు ఆ తీపివార్త ఎప్పుడు అందుతుందో వేచిచూడాల్సివుంది.